Begin typing your search above and press return to search.
వైసీపీకి పెద్ద గొంతు ఆయనేనా... ?
By: Tupaki Desk | 19 Dec 2021 11:35 AM GMTవైసీపీ తరఫున మాట్లాడేవారు తక్కువ మందే ఉంటారు. టీడీపీకి ధీటుగా స్పందించే వారు ఇంకా తక్కువ అని చెప్పాలి. టీడీపీ అయితే ఒక పద్ధతి ప్రకారం సబ్జెక్ట్ మీద అందరికీ ట్రైనింగ్ ఇచ్చి మరీ మీడియా ముందుకు పంపిస్తుంది. అదే వైసీపీలో మీడియా ముందుకు వచ్చే వారు చాలా సార్లు పార్టీ లైన్ దాటి తమ సొంత వ్యాఖ్యానం కూడా చేస్తారు. అది కొత్త తలనొప్పులు కూడా తెచ్చేస్తోంది. ఇక ఈ మధ్య వైసీపీ తరఫున కొందరు నేతలు మాట్లాడిన మాటలు బూమరాంగ్ కావడంతో అధినాయకత్వం నుంచి పర్మిషన్ ఉన్న వారికే అనుమతిస్తున్నారుట.
అలా విశాఖ వరకూ చూసుకుంటే ఆయనదే పెద్ద గొంతు అంటున్నారు. అక్కడ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మరే అగ్ర నేత అయినా కామెంట్ చేస్తే విశాఖలో అందరి కంటే ముందుగా మీడియా వద్దకు గట్టిగా రీ సౌండ్ చేసే ఆ యువ నాయకుడు గుడివాడ అమరనాధ్. ఆయన అనకాపల్లి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే నియోజకవర్గం సంగతేమో కానీ జగన్ మీద అసలు ఈగ వాలనివ్వరు అంటే మాత్రం ఒప్పుకోవాలేమో.
గుడివాడ మాటలు ఎంత పదునుగా ఉంటాయంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుని సైతం ఎక్కడా స్పేర్ చేయకుండా దబాయించేస్తారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాన్ని ప్రతీ సారీ చర్చకు పెట్టడం కూడా గుడివాడకే చెల్లింది అనుకోవాలి. ఆయన జగన్ కి అత్యంత సన్నిహితుడు అని పేరు. ఆయన రాకతో వైసీపీలో సీనియర్లు నాడు కొందరు పార్టీని వదిలేశారు. ఇక మరి కొందరు నాయకులు కూడా పార్టీలో ఈ యువ నేతతో పొసగక వేరే చూపులు చూస్తున్నారు.
అయితేనేమి, గుడివాడకు అధినాయకత్వం వద్ద మంచి పట్టుంది. ఆయనకు ఇస్తే గిస్తే మంత్రి పదవి కూడా అని ప్రచారం సాగుతోంది. దాంతో ఆయన చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని కూడా ఒకే గాటన కట్టి ఘాటైన విమర్శలు చేస్తూ పోతున్నారు. విశాఖ జిల్లాకు ఒక మంత్రి ఉన్నారు. ఆయనే అవంతి శ్రీనివాసరావు, ఆయన మీడియా ముందుకు రాకుండానే గుడివాడ ప్రెస్ మీట్ పెట్టేసి ప్రత్యర్ధి పార్టీలను చీల్చిచెండాడేస్తారు.
దాంతో అటు పార్టీలో ఇటు జిల్లాలో ఆయనే బాగా ఫోకస్ అవుతున్నారు. అయితే ఇదంతా మంత్రి గిరీ కోసమే తప్ప మరోటి కానే కాదని సొంత పార్టీతో పాటు టీడీపీ నుంచి కూడా కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. ఇంతకీ గుడివాడ అమరానాధ్ కి పొలిటికల్ గా లైఫ్ ఇచ్చింది టీడీపీ. సొంత పార్టీ మీద, మీకు, మీ కుటుంబానికి అవకాశాలు ఇచ్చిన చంద్రబాబు మీద విమర్శలు చేస్తావా అని టీడీపీ తమ్ముళ్లు గట్టిగా నోరు చేసుకున్నా గుడివాడ మాత్రం తన రూటే సెపరేట్ అంటారు. ఎందుకంటే ఆయన టార్గెట్ ఒక్కటే ఉంది. అది అందరికీ తెలుసు అంటారు. మరి ఆయనకు కనుక మంత్రి పదవి ఇవ్వకపోతే విశాఖలో ఈ పెద్ద గొంతు మూగపోతుందా అన్నది చూడాల్సిందే.