Begin typing your search above and press return to search.
రొనాల్డో కల చెదరగొట్టిన అతడు మేనేజరా? డ్యామేజరా?
By: Tupaki Desk | 11 Dec 2022 9:30 AM GMTఫుట్ బాల్ ప్రపంచ కప్.. పోర్చుగల్ -స్విట్జర్లాండ్ మధ్య ప్రి క్వార్టర్స్ మ్యాచ్. పోర్చుగల్ గోల్స్ మీద గోల్స్ కొడుతోంది.. ఆ జట్టు ఆటగాడు రామోస్ హ్యాట్రిక్ కూడా సాధించాడు.. అయితే, మైదానంలోని అభిమానులు.. టీవీల ముందున్న ప్రేక్షకుల కళ్లన్నీ ఒక్కరి మీదే ఉన్నాయి. అతడి కోసం వెదుకుతున్నాయి. కానీ, అతడు కనిపించడే..? ఫుట్ బాల్ ప్రపంచ కప్.. పోర్చుగల్-మొరాకో మధ్య క్వార్టర్స్ మ్యాచ్. ఇది గెలిస్తే సెమీఫైనల్స్. పోర్చుగల్ ఫేవరెట్. మైదానంలో కూడా ఆ జట్టుదే ఆధిపత్యం. ఆటగాళ్లంతా కసికసిగా ఆడుతున్నారు. మొరాకో దూకుడుగా కనిపించినా పోర్చుగల్ దే గెలుపని అనుకంటున్నారు. కానీ, గోల్ కావడం లేదు. మళ్లీ అభిమానుల కళ్లన్నీ మళ్లీ అతడి కోసం చూస్తున్నాయి. కానీ, ఈసారీ కనిపించడే..? చివరకు సెకండాఫ్ లో కానీ అభిమానులు అతడిని చూడలేకపోయారు. ఈ ఉపోద్ఘాతమంతా ఏమిటంటే.. ఎందుకంటే.. క్రిస్టియానో రొనాల్డో గురించి. ఈ పోర్చుగల్ స్టార్ వరుసగా రెండో మ్యాచ్ లోనూ సబ్ స్టిట్యూట్ గా బరిలో దిగాల్సి వచ్చింది. రొనాల్డో వంటి ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు సబ్ స్టిట్యూట్ గా రావడం ఏమిటి? అది కూడా ప్రి క్వార్టర్స్, క్వార్టర్స్ వంటి నాకౌట్ మ్యాచ్ లో రావడం ఏమిటి? అంటే.. అంతే మరి.. మరేదైనా క్రీడలో అయితే ఇలా జరగదేమో? కానీ, ఫుట్ బాల్ లో మాత్రం సహజం.
కోచ్ కాదు మేనేజర్ ఏ ఇతర క్రీడల్లో అయినా జట్టు శిక్షణ వ్యవహారాలను, తుది జట్టు కూర్పును పర్యవేక్షించే వాడిని కోచ్ అని అంటారు. ఫుట్ బాల్ లో మాత్రం మేనేజర్ గా వ్యవహరిస్తారు. జట్టు విషయంలో అతడి మాటే వేదం. అంతమాత్రాన మేనేజర్ అంటే పాత పద్ధతుల్లో ఉంటాడని అనుకోవద్దు. బహుళ జాతి కంపెనీ సీఈవో తరహాలో స్టైలిష్ గా సూట్ వేసుకుని.. గ్రౌండ్ లో జట్టును నిర్దేశం చేస్తూ ఉంటాడు. ఎంత పెద్ద స్టార్ అయినా, జట్టులోకి తీసుకోవద్దని మేనేజర్ నిర్ణయిస్తే అతడు డగౌట్ లో కూర్చోవాల్సిందే. క్రిస్టియానో రొనాల్డో విషయంలో ఇదే జరిగింది. అతడి ప్రపంచ కప్ కల చెదిరింది.
ఎవరా పోర్చుగల్ కోచ్..? ఫెర్నాండో శాంటోస్.. పోర్చుగల్ మేనేజర్. నాకౌట్ రౌండ్ మ్యాచ్‌ల్లో రొనాల్డో ను బెంచ్‌కే పరిమితం చేసిందితడే. వరుసగా రెండు మ్యాచ్ ల్లోనూ రొనాల్డోను సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా దింపడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతోంది. మొరాకోతో క్వార్టర్స్ లో మ్యాచ్ 50 నిమిషాలు అయ్యాక రొనాల్డో మైదానంలోకి వచ్చాడు. అయితే, పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కాగా, రొనాల్డోపై తన నిర్ణయాన్ని శాంటోస్ సమర్థించుకొన్నాడు. "నాకు బాధ లేదు. నేను ఏమీ మార్చలేను. స్విట్జర్లాండ్‌పై అద్భుతంగా ఆడిన జట్టునే బరిలోకి దింపాను. దానిని ఎందుకు మార్చాలో నాకు తెలియదు. రొనాల్డో విషయంలో తీసుకొన్న కఠిన నిర్ణయం వ్యూహాత్మకమైంది. జట్టు విషయంలో మనసుతో కాదు.. మెదడుతో ఆలోచించాను. అంతమాత్రాన రొనాల్డో గొప్ప ఆటగాడు కాకుండా పోడు. కొన్ని సందర్భాల్లో ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లో అదృష్టం కూడా కలిసి రావాలి" అని వేదాంతం వల్లించాడు. అయితే, దీనిపై రొనాల్డో జీవిత భాగస్వామి జార్జియాన రోడ్రిగజ్ మండిపడ్డారు. శాంటోస్ నిర్ణయంతో పోర్చుగల్ ఓటమి మూటగట్టుకొందన్నారు. "ఈ రోజు మీ మిత్రుడు, కోచ్ నిర్ణయం తప్పు. నువ్వు ఏ మిత్రుడిని గౌరవిస్తావో అతడే నిన్ను ఈ రోజు మైదానంలోకి దింపి పరిస్థితులు ఏవిధంగా మారతాయో చూశాడు. కానీ, అప్పటికే ఆలస్యమైపోయింది" "మీ వద్ద ఉన్న ఆయుధమైన ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిని తక్కువగా అంచనావేయ కూడదు. అర్హత లేని వారి పక్షాన నిలబడకూడదు" అని కోచ్ శాంటోస్‌ను ఆమె తప్పుపట్టారు. మరోవైపు క్రిస్టియానో రోనాల్డోకు వీడ్కోలు పలుకుతూ ఫిఫా ట్విటర్‌లో థాంక్యూ అని సందేశాన్ని ఉంచింది.
అతడికీ ఉద్వాసనే..? కోచ్ మొండి నిరణయంతో క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్ కల చెదిరింది. కెరీర్‌లో కనీసం ఒక్క ప్రపంచకప్ అయినా సాధించాలన్న ఆశ అడియాసే అయింది.మొరాకోతో మ్యాచ్ ఓటమి అనంతరం రొనాల్డో మైదానంలోనే కన్నీటి పర్యంతమయ్యాడు. మొరాకోతో క్వార్టర్ ఫైనల్స్‌లో 1-0 తేడాతో ఓటమితో పోర్చుగల్ ఇంటికి పయనమైంది. కాగా, రొనాల్డో వయసు 37 ఏళ్లు. అతడు మరో ప్రపంచకప్ ఆడే అవకాశాలు లేవు. అందుకని మొరాకోతో మ్యాచ్‌లో ఓడిపోగానే భావోద్వేగానికి లోనయ్యాడు. చిన్న పిల్లాడిలా మైదానంలో ఏడ్చాడు. కన్నీళ్లను తుడుచుకొంటూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతున్న చిత్రాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అంటే.. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాడిగా పేరున్న రొనాల్డో కెరీర్‌లో వరల్డ్‌కప్ ఓ లోటుగానే మిగిలి ఉంటుంది. పోర్చుగల్ తరఫున 195 మ్యాచ్‌లు ఆడిన క్రిస్టియానో రొనాల్డో 118 గోల్స్ చేశాడు. అయితే, రొనాల్డోను ఇంతగా వేధించిన కోచ్/మేనేజర్ శాంటోస్ కూడా బావుకునేదేమీ లేదు. అతడిపైనా మరికొన్నాళ్లలో వేటు ఖాయమేనని వార్తలు వస్తున్నాయి. శాంటోస్ ను జట్టు నుంచి తొలగించొచ్చనే వార్తలు వస్తున్నాయి. రొనాల్డో విషయంలో అతడు తీసుకున్న నిర్ణయమే దీనికి కారణం. కానీ, ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నాం ఏం లాభం? అంతా అయిపోయాక.. చివరకు రొనాల్డో లేని పోర్చుగల్ ఓ సాధారణ జట్టులా మిగిలిపోవడ తప్ప ఒరిగేదేం లేదు.
కొసమెరుపు... అక్కడా రొనాల్డోను తప్పించారు.. ఇదే రొనాల్డో రెండు నెలల కిందటి వరకు మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్ బాల్ క్లబ్ జట్టు సభ్యుడు. ఈ దిగ్గజంతో వేలాది కోట్ల కాంట్రాక్టును కుదుర్చుకుంది ఆ ఫ్రాంచైజీ. కానీ, రొనాల్డో... జట్టు మేనేజర్ తో విభేదించాడు. దీంతో వేటు పడింది.. మేనేజర్ పై కాదు రొనాల్డోపై.. దీన్నిబట్టే ఫుట్ బాల్ లో మేనేజర్ పాత్ర ఎంత బలీయమైనదో?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.