Begin typing your search above and press return to search.

లేడీ సీఎం గ్యారంటీనా?

By:  Tupaki Desk   |   30 Aug 2022 5:05 AM GMT
లేడీ సీఎం గ్యారంటీనా?
X
జార్ఖండ్ లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. హేమంత్ ఆధ్వర్యంలోని జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాగైనా కూల్చేయాలని బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. హేమంత్ పై ఎంఎల్ఏగా అనర్హత వేటు వేసే అంశం ప్రస్తుతం గవర్నర్ నిర్ణయంపై ఆధారపడుంది. గవర్నర్ గనుక అనర్హత వేటు వేస్తే హేమంత్ ముఖ్యమంత్రిగా తప్పుకోవాల్సిందే తప్ప వేరే దారి లేదు. ఇపుడు హేమంత్ కు వారసులు ఎవరనే చర్చ బాగా పెరిగిపోతోంది.

ఈ నేపధ్యంలోనే కొందరి పేర్లు చర్చకు వస్తున్నా ఎక్కువగా కల్పనా సోరేన్ కే అవకాశాలున్నట్లు అర్ధమవుతోంది. ఇంతకీ కల్పన ఎవరంటే హేమంత్ భార్య. ఇప్పటివరకు కల్పన ప్రత్యక్షంగా ఎక్కడా రాజకీయాల్లో కనబడలేదు.

ఇంటికి మాత్రమే పరిమితమైన కల్పన రేపు జార్ఖండ్ పగ్గాలు పట్టాల్సిన అవసరం రావచ్చు. ఇక తండ్రి శిబూసొరేన్ ఉన్నప్పటికీ ఈయనపై ఇప్పటికే అనేక కేసులున్నాయి. మర్డర్ కేసులో ఇప్పటికే కొంతకాలం జైలులో ఉండొచ్చారు.

78 ఏళ్ళ శిబుకు అనారోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి తండ్రి సీఎం సీటులో కూర్చుంటారని అనుకోవటం లేదు. ఇక హేమంత్ తల్లి రూపీసోరేన్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే భార్య ఉండగా హేమంత్ తల్లికి పగ్గాలు అప్పగించరని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. పైగా తల్లి ఇప్పటివరకు రాజకీయాల్లో ఎక్కడా కనబడలేదు. అలాగే కల్పన కూడా కనబడకపోయినా కొన్ని అధికారిక కార్యక్రమాల్లో హేమంత్ తో కలిసి కల్పన పాల్గొన్న సందర్భాలున్నాయి.

సీతా సోరేన్ నేపధ్యాన్ని పరిశీలించాల్సిందే. ఇంతకీ ఈమె ఎవరంటే హేమంత్ కు అన్న దుర్గాసోరేన్ భార్య. నిజానికి హేమంత్ స్ధానంలో దుర్గాయే పార్టీపగ్గాలు, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాల్సింది. కాకపోతే ఆయన బ్రెయిన్ స్ట్రోక్ చనిపోవటంతో శిబు వారసునిగా హేమంత్ ప్రొజెక్టయ్యారు. పెద్దకొడుకు దుర్గా చనిపోవటంతో ఆయన భార్య సీతాసోనేన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు.

ఈమెకు రాజకీయాలంటే బాగానే ఆసక్తుంది. ప్రస్తుతం జామా నియోజవకర్గం ఎంఎల్ఏగా ఉన్నారు. కూతురు అంజలీ సోరేన్ ఉన్నప్పటికీ వివాహం తర్వాత ఒడిస్సా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. కాబట్టి హేమంత్ ప్లేసులో తొందరలో కల్పనే పగ్గాలు అందుకనే అవకాశముంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.