Begin typing your search above and press return to search.
పిల్లల్ని చంపేసింది కాక హీరోగా ప్రచారమా?
By: Tupaki Desk | 15 Aug 2017 4:34 AM GMTమోడీ సర్కారుకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇవ్వటమే కాదు.. దూసుకెళుతున్నట్లుగా చెప్పుకునే యూపీ యోగి సర్కారుకు ముచ్చమటలు పోసేలా చేసింది గోరఖ్ పూర్ ఆసుపత్రి విషాద ఉదంతం. దాదాపు 70కి పైగా పిల్లలు ప్రాణాలు కోల్పోయి.. ఎంతోమంది తల్లుల గర్భశోకానికి విలవిలలాడుతుంటే.. దారుణమైన రాజకీయం తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పిల్లల ప్రాణాల్ని రక్షించాల్సిన బీఆర్డీ ఆసుపత్రి చిన్నపిల్లల విభాగం అధిపతిగా పని చేసిన డాక్టర్ కఫీల్ ఖాన్ తొలగింపుపై భిన్న కథనాలు మీడియాలో రావటం తెలిసిందే.
అతన్ని హీరోగా అభివర్ణిస్తూ.. పిల్లల ప్రాణాలు పోకుండా ఉండేందుకు అతగాడు ఎన్నో ప్రయత్నాలు చేసినట్లుగా.. అతడిపై వేటు వేయటంపై విస్మయాన్ని వ్యక్తం చేసేలా కొన్ని కథనాలు మీడియాలో వచ్చాయి. పిల్లల ప్రాణాల్ని కాపాడేందుకు చివరికంటా ప్రయత్నించిన డాక్టర్ కఫీల్ ఖాన్ లాంటోడిపై ప్రభుత్వం ఎలా వేటు వేస్తుందన్న సందేహాన్ని వ్యక్తం చేసేలా ఒక కథనం కొన్ని మీడియాలలో ప్రముఖంగా వచ్చింది.
దీనిపై ఢిల్లీలోని ఎయిమ్స్ రెసిడెంట్ వైద్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ఉదంతంలో కఫీల్ ను బలిపశువును చేశారన్న వాదన వినిపిస్తుంటే.. ఈ మొత్తం దారుణానికి కేంద్రమైన బీఆర్డీ వైద్యకళాశాలకు చెందిన అత్యున్నత స్థాయి నివేదిక ప్రకారం.. కఫిల్ ఖాన్ ఒకకట్టుకథను తయారుచేసి ప్రచారం చేస్తున్నట్లుగా మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన షాకింగ్ వాస్తవాల్ని వారు బయటపెడుతున్నారు.
కఫిల్ ఖాన్ పిల్లల డాక్టర్ అయిన్పటికీ ఆయన భార్య మాత్రం దంత వైద్యురాలు. కానీ.. ఆమె పేరుతో 50 పడకల చిన్నపిల్లల ఆసుపత్రిని నడిపిస్తున్నాడని కఫిల్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూపీ చట్టాల ప్రకారం ప్రభుత్వ వైద్యులు ఎవరూ ప్రైవేటు ప్రాక్టీస్ చేయరాదు. ఆ నిబంధన ఉన్నప్పటికీ ఆయన భార్య పేరిట ఆసుపత్రి నిర్వహిస్తున్న వైనాన్ని పలువురుప్రశ్నిస్తున్నారు.
అన్నింటి కంటే కీలకమైన మరో విషయం బీఆర్డీ కొనుగోలు వ్యవహారం. ఇందులో డాక్టర్ కఫీల్ ఖాన్ ఒక సభ్యుడన్న విషయం ఆయనకు బాగా తెలుసని.. పెద్ద ఎత్తున చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన అనంతరం మాట్లాడిన డాక్టర్ కఫీల్.. తాను ముస్లింను కాబట్టి కొందరు వ్యక్తులు పని గట్టుకొని సోషల్ మీడియాలో తనను అప్రదిష్ట పాలు చేసేందుకు ప్రచారం చేస్తున్నట్లుగా వెల్లడించారు. అయితే.. కఫీల్ ప్రచారాన్ని నమ్మితే ప్రాణాలు పోయిన పిల్లల్ని మోసం చేసినట్లే అవుతుందని.. వారి మరణం కఫిల్ దుర్మార్గాన్ని బయటపెట్టిందన్నవిమర్శలు వినిపిస్తున్నాయి.