Begin typing your search above and press return to search.

హైదరాబాద్ దేశ రెండో రాజధాని కాబోతోందా ..?

By:  Tupaki Desk   |   5 Nov 2019 11:54 AM GMT
హైదరాబాద్ దేశ రెండో రాజధాని కాబోతోందా ..?
X
దేశ రాజధాని ఢిల్లీ మహానగరం గత కొన్ని రోజులుగా కాలుష్యం లో చిక్కుకొని తీవ్రమైన ఇబ్బందులని ఎదుర్కొంటుంది. సాధారణంగానే ఢిల్లీ లో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది ..దానికి తోడు ఈ మద్యే దీపావళి పండుగ కూడా రావడం తో కాలుష్యం ఒక్కసారిగా పీక్ స్టేజ్ కి చేరింది. దీనితో ఢిల్లీ లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. దీనితో కొంతమంది ఢిల్లీ లో ఇక మేము ఉండలేము బాబోయ్ అంటూ ఢిల్లీ నుండి దుకాణం సర్దేస్తున్నారు. ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కాలుష్య తీవ్ర దృష్ట్యా పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం.

ఈ సమయంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సీహెచ్‌ విద్యాసాగర్ రావు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ లో నెలకొన్న కాలుష్యపరిస్థితులను చూస్తుంటే డా. బీఆర్ అంబేడ్కర్ కోరుకున్నట్లుగా హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందేమోనని చెప్పుకొచ్చారు. తెలుగు వర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్‌ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కూడా ఇలాంటి వార్తలు ఎన్నో వచ్చినప్పటికీ ..ఇప్పుడు మాజీ గవర్నర్, బీజేపీ నేత ఈ వ్యాఖ్యలు చేయడంతో అయన మాటలకి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇకపోతే ఢిల్లీ లో ప్రభుత్వం సరి , బేసి విధానాన్ని మళ్ళీ అమలులోకి తీసుకువచ్చింది. ఈ విధానంతో కొంత వరకు కాలుష్యం నుండి బయటపడినా పూర్తి స్థాయిలో మాత్రం గాలి స్వచ్ఛతను అందుకోలేదు . మరోవైపు దేశ రాజధానిలో వాయు కాలుష్యం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.