Begin typing your search above and press return to search.
మీకు ఆదాయమే ముఖ్యమా .. తెలంగాణ ప్రభుత్వం పై హైకోర్టు ఫైర్
By: Tupaki Desk | 19 April 2021 7:32 AM GMTతెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర హైకోర్టు అడిగిన వివరాలని ఎందుకు ఇప్పటివరకు ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలో సెకండ్ వేవ్ లో కేసులు పెరుగుతుంటే , పక్క రాష్ట్రాల నుండి వచ్చే వారికి కరోనా టెస్టులు ఎందుకు చేయడం లేదని మండిపడింది. అలాగే రాష్ట్రంలో పబ్లిక్ గ్యాదరింగ్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పినా ఎందుకు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. పబ్ లు, బార్లపై క్లబ్ లపై ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకున్నారు అంటూ హైకోర్టు సీరియస్ అయింది. మొత్తంగా చూస్తే ఈ కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో కూడా మీకు ఆదాయమే ముఖ్యమా అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హై కోర్టు. ఆర్టీపీసీఆర్ టెస్టులపై వివరాలు లేవని పేర్కొంది. 14 అదనపు సెంటర్లకు అనుమతి అన్నారు.. ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అని సూటిగా అడిగింది. అలాగే , దీనిపై ప్రభుత్వ నిర్ణయాలను మధ్యాహ్నంలోగా నివేదించాలని ఆదేశాలు జారీచేసింది.
ఇకపోతే , కరోనా వైరస్ రెండో దశలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. గాలి ద్వారా 10 నిమిషాల్లో వ్యాప్తి చెందే కరోనా వైరస్ రెండో దశలో కేవలం నిమిషం వ్యవధిలో వ్యాప్తి చెందుతుంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు కరోనా మరణాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో తాజాగా 4,009 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,55,433కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 83,089 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 4 వేల 9 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 55 వేల 4 వందల 33కి చేరింది. కరోనా బారిన పడి రాష్ట్రంలో మరో 14 మంది మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,838కి చేరింది.