Begin typing your search above and press return to search.

పెరుగుతున్న టెక్నాలజీ అనర్ధదాయకమేనా..!

By:  Tupaki Desk   |   12 Dec 2022 11:30 AM GMT
పెరుగుతున్న టెక్నాలజీ అనర్ధదాయకమేనా..!
X
మనిషి తన మేధస్సుతో దేవుడి సృష్టికి ప్రతిసృష్టి చేసే స్థాయికి ఎదిగిపోయాడు. ఈ భూమిలోని అన్ని జీవరాశులలో కెల్లా తానే బెస్ట్ అని మనిషి తరుచూ నిరూపించుకుంటున్నాడు. అయితే మనిషి తన స్వార్థపూరిత ఆలోచనలతో ఇతర జీవ రాశులకు హాని కలిగిస్తున్నాడనేది మాత్రం అందరూ ఒప్పుకొని తీరాల్సిందే.

కంప్యూటర్.. ఇంటర్నెట్.. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక మనిషి తాను ఉన్న చోటి నుంచే అన్ని పనులు చక్కబెడుతున్నాడు. అత్యాధునిక టెక్నాలజీతో విశ్వాన్ని అరచేతిలో బంధించేస్తున్నాడు. ఈ క్రమంలోనే అనేక జీవ రాశులు తన ఉనికి కోల్పోవాల్సి వస్తుందని పర్యావరణ వేత్తలు.. మానవతవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సెల్ ఫోన్ టవర్ సిగ్నల్ కారణంగా గతంలో పక్షులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇదే విషయంలో దర్శకుడు శంకర్ రోబో 2.0 మూవీలో 'పక్షి రాజా' అనే క్యారెక్టర్ సృష్టించి మొబైల్ వాడకం.. సెల్ ఫోన్ సిగ్నల్ వల్ల పక్షులకు ఎంతటి హాని జరుగుతుందో విజువల్ గా చూపించాడు.

3జీ.. 4జీ సెల్ ఫోన్ సిగ్నల్ కారణంగానే పక్షులు ఇబ్బంది పడితే తాజాగా 5జీ దేశ వ్యాప్తంగా రాబోతోంది. ఇప్పటికే కొన్ని నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముంబై.. ఢిల్లీ.. బెంగూళూరు.. చెన్నై.. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో తొలి విడుత సేవలను ఆయా సెల్ ఫోన్ కంపెనీలు ఇప్పటికే ప్రారంభించాయి.

ఈ నేపథ్యంలోనే 5జీ టెక్నాలజీ కారణంగా కొన్ని పక్షులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఒక వీడియోలో మూడు పిచ్చుకలు మరణించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీంతో ఇండియాలో 5జీ టెక్నాలజీని బ్యాన్ చేయాలనే డిమాండ్ నెటిజన్ల నుంచి వినిపిస్తోంది.

ఇంటర్నెట్.. మొబైల్.. కంప్యూటర్ వ్యవస్థలకు ప్రస్తుతం ఉన్న 3జీ.. 4జీ సరిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మన సౌకర్యాల కోసం చిన్న చిన్న పక్షుల ఊసురు పోసుకోవద్దని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 5జీ టెక్నాలజీ వాడకంపై సోషల్ మీడియాలో మరోసారి పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటుందో లేదో వేచిచూడాల్సిందే..!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.