Begin typing your search above and press return to search.

పీకేకు వెన్నుపోటు.. జగన్ కు పోటు?

By:  Tupaki Desk   |   28 May 2020 5:30 PM GMT
పీకేకు వెన్నుపోటు.. జగన్ కు పోటు?
X
మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ గెలుపులో కీలకంగా వ్యవహరించింది రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం. ప్రశాంత్ కిషోర్‌ కు చెందిన ఐ-పాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) వైసీపీ ఎన్నికల వ్యూహాల నుంచి ప్రచారం వరకు పార్టీ అధినేత జగన్ తో పాటు శ్రేణులను కూడా ముందుండి నడిపించింది. జగన్ ను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్న ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించి రాజకీయ వ్యూహాలు పన్ని జగన్ ను గెలిపించారు. పీకే వ్యూహాలకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు చిత్తు అయిపోయి ఓడిపోయాడు. చంద్రబాబు ఓడాక పీకేపై ‘బీహార్ బందిపోటు’ అని కూడా విమర్శించాడు.

ఇలా జగన్ గెలుపులో.. చంద్రబాబు ఓటమిలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ టీం ఐ-పాక్ లో విభేదాలు పొడచూపినట్టు వార్తలు వస్తున్నాయి. పీకే టీమ్ లో కీలకంగా వ్యవహరించిన ఉత్తరప్రదేశ్ కి చెందిన ఒక వ్యక్తి ఇప్పుడు ఐ-పాక్ నుండి బయటకి వచ్చి సొంత కుంపటి పెట్టుకున్నట్టు సమాచారం.

పీకేకు వెన్నుపోటు పొడిచి అతడి టీం నుంచి విడిపోయి ఇప్పుడు ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుకు పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. టీడీపీకి వ్యూహకర్తగా మారిన ఇతడు ఇప్పటికే ఎన్టీఆర్ భవన్ లో కార్యకలాపాలు స్టార్ట్ చేసినట్టు ప్రచారం సాగుతోంది.

జగన్ కి ఐ-పాక్ లాగా లాగా చంద్రబాబుకి ఈ పీకే వెన్నుపోటు టీం వర్క్ చేస్తోందట.. దాదాపు ఐ-పాక్ లో వర్క్ చేసిన వారే ఇప్పుడు దీంట్లో వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జగన్ దగ్గర పని చేసి ఉండటంతో ఆయన ప్లస్సులు మైనస్సులు తెలియడం మనకు ప్లస్ అవుతుందని చంద్రబాబు ఏరికోరి ఈ టీంను తన పార్టీకి వ్యూహకర్తలుగా పెట్టుకున్నారని ఆ పార్టీ వర్గాల ద్వారా వార్తలు లీక్ అవుతున్నాయి.

ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. జగన్ గుట్లు.. మట్లు తెలియడంతో లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే ఈ టీమ్ తమ వ్యూహాలతో ఫీల్డ్ లోకి దిగుతోందని సమాచారం. ఎలాగైనా వచ్చే ఎన్నికలలో మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్న చంద్రబాబు వారికి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చి పనిచేయించుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది.