Begin typing your search above and press return to search.
ఈ సమయంలో ఐపీఎల్ అవసరమా.. ఇక ఆపండి !
By: Tupaki Desk | 4 May 2021 6:00 AM GMTఐపీఎల్ .. ఇండియన్ ప్రీమియర్ లీగ్..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్. ఒక్క ఏడాది అదిరిపోయే ఫోర్ఫామెన్స్ ఇస్తే చాలు కోట్లు కుమ్మరించడానికి చాలా ప్రాంచైజీలు ఎదురుచూస్తుంటాయి. దీనికోసమే దేశం కోసం ఆడటం కంటే ఐపీఎల్ లో రెండు , మూడేళ్లు ఆడితే చాలు లైఫ్ సెటిల్ అవుతుంది అని భావించే వారే ఎక్కువ. ఇక ఈ సీజన్ ఐపీఎల్ పై మొదట్లో కొంచెం అనుమానం ఉన్నప్పటికీ , ఆ తర్వాత ఐపీఎల్ నిర్వహణ పై స్పష్టమైన క్లారిటీ వచ్చింది వచ్చింది. బయోబబుల్ వాతావరణంలో ఈ ఏడాది ఐపీఎల్ ను నిర్వహిస్తున్నారు.
ఎంతో పటిష్టమైన చర్యల మధ్య ఐపీఎల్ కొనసాగిస్తున్నా కరోనా కేసులు రావడంతో ఇక ఈ లీగ్‌ను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ వినిపిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ క్యాంప్ లో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఆర్సీబీతో జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో మిగతా మ్యాచ్ లు ఎంతవరకూ జరుగుతాయనే సందిగ్థత ఏర్పడింది. మరొకవైపు మాజీ క్రికెటర్లు కూడా ఐపీఎల్ ను ఆపితేనే మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ నిర్వహణ సాధ్యాసాధ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ మాట్లాడుతూ.. ‘ నేను ముందుగా అనుకున్నది బయోబబుల్‌లో ఐపీఎల్ ను జరుపుతున్నారు కాబట్టి కరోనా ఎఫెక్ట్ ఉండదనే అనుకున్నా క్రికెటర్లంతా సేఫ్ గానే ఉంటారని భావించా. కానీ దురదృష్టవశాత్తూ బయోబబుల్ వాతావరణంలో ఐపీఎల్ నిర్వహిస్తున్నా క్రికెటర్లు కరోనా బారిన పడుతున్నారు. అంటే రక్షణ లేదనేది ఇక్కడ అర్థమవుతోంది. వచ్చే రోజుల్లో పరిస్థితులు కఠినంగా ఉండవచ్చు. ఈ తరుణంలో ఐపీఎల్ అవసరమా.. ఇక ఆపండి అని డిమాండ్ చేస్తున్నారు.
ఇక కరోనా ఎటాక్ చేయడం తో ప్లేయర్స్ ను అటూఇటూ తిప్పడం సరి కాదని బోర్డు భావిస్తోంది. మిగిలిన మ్యాచ్ లను ముంబైలో నిర్వహించే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు ఎన్డీటీవీ వెల్లడించింది. ముంబై నగరంలో ఎలాగూ మూడు స్టేడియాలు ఉన్నాయి కాబట్టి.. అక్కడైతే మ్యాచ్ ల నిర్వహణకు అడ్డంకి ఉండదని బోర్డు భావిస్తున్నట్లు ఆ రిపోర్టు తెలిపింది. ఇప్పటికే ముంబైలోని హోటళ్లతోనూ బీసీసీఐ అధికారులు మాట్లాడారు. 8 టీమ్స్‌కు బయో బబుల్ ఏర్పాటు చేయాల్సిందిగా వాళ్లు కోరారు. ఒకవేళ బోర్డు ఇదే నిర్ణయంతో బీసీసీఐ ముందుకు వెళ్లాలని భావిస్తే కోల్‌కతా, బెంగళూరులలో జరగాల్సిన మ్యాచ్ లు రద్దవుతాయి. దీంతో ప్లేయర్స్‌ను అటూఇటూ తిప్పడం సరి కాదని బోర్డు భావిస్తోంది. లీగ్ ను ముంబైకి తరలించేందుకు ప్రభుత్వ అనుమతి కోసం బీసీసీఐ ఎదురు చూస్తున్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ ఐ కూడా వెల్లడించింది. దీంతో బుధవారం ఢిల్లీలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా అనుమానంగానే మారింది. ఇప్పటికే చెన్నై టీమ్ సిబ్బందిలో ఒకడైన బాలాజీ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.