Begin typing your search above and press return to search.

బీజేపీపై దెబ్బ పడినట్లేనా ?

By:  Tupaki Desk   |   14 Feb 2022 7:44 AM GMT
బీజేపీపై  దెబ్బ పడినట్లేనా ?
X
ఎన్నికలు జరుగుతున్నది ఐదు రాష్ట్రాలకి అయినా దేశంలో చాలామంది దృష్టిమాత్రం ఉత్తర ప్రదేశ్ పైనే ఉంది. యూపీ ఎన్నికల్లో రాబోయే ఫలితంపైనే దేశ రాజకీయ పరిణామాలు ఆధారపడున్నాయి. ఇపుడు రాబోయే ఫలితాల సరళిని బట్టే 2024 ఎన్నికల సరళిని అంచనా వేయచ్చని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అందుకనే యూపీ ఎన్నికలపైన అంత ఆసక్తి చూపుతున్నారు. మొన్నటి 10వ తేదీన మొదటి విడతలో భాగంగా 58 సీట్లకు ఎన్నికలు జరిగాయి.

పశ్చిమయూపీలోని 128 సీట్లకు గాను మొదటివిడతలో 58 సీట్లకు పోలింగ్ జరిగింది. మొదటి నుండి పశ్చిమ యూపీ పోలింగ్ బీజేపీకి ఏమంతా అనుకూలంగా ఉండదనే సంకేతాలున్నాయి. దానికి తగ్గట్లే 58 సీట్లకు జరిగిన పోలింగ్ కమలంపార్టీకి పెద్దగా అనుకూలంగా జరగలేదని విశ్లేషణలు మొదలయ్యాయి. కారణం ఏమిటంటే అర్బన్ ప్రాంతంలో పోలింగ్ సగటున 55 శాతమైతే గ్రామీణ ప్రాంతంలో సగటున 70 శాతం పోలింగ్ జరిగిందట. ఈ ప్రాంతంలో ముస్లింలు, జాట్లదే కీలకపాత్ర. ఈ రెండు సామాజికవర్గాలు మొదటినుండి బీజేపీని వ్యతిరేకిస్తునే ఉన్నాయి.

తాజా విశ్లేషణల ప్రకారం అర్బన్ ప్రాంతంలో 50 శాతం, గ్రామీణ ప్రాంతంలో 80 శాతం పోలింగ్ ఎస్పీ కూటమికి అనుకూలంగా జరిగిందట. ఎస్పీ-ఆర్ఎల్డీ మధ్య ఓట్ల ట్రాన్సఫర్ బాగా జరిగిందని సమాచారం. గతంలో కొన్ని సీట్లలో చాలా ఈజీగా గెలిచిన బీజేపీ అభ్యర్ధులు ఇపుడు చాలా కష్టపడాల్సొచ్చిందట.

ఇంత కష్టపడినా గెలుపుపై విశ్వాసం కుదరటంలేదని పువ్వు పార్టీ నేతలే చెప్పుకుంటున్నారట. బీజేపీలో బలమైన దళిత నేతైన మాజీ గవర్నర్ బేబీ మౌర్య గెలుపు కూడా అంత వీజీ కాదని సొంతపార్టీ నేతలు చెబుతున్నారట.

ఆలీఘడ్, మీరట్ జిల్లాల్లో కూడా ఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి అభ్యర్ధులు బీజేపీ అభ్యర్ధులకు ముచ్చెమటలు పట్టించారట. పై జిల్లాల్లో జాట్లు, ముస్లింలు సమన్వయంతో పనిచేశారట. దాంతోనే ఓట్ల బదలాయింపులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని చెప్పుకుంటున్నారు.

బీఎస్పీ నుండి సమస్యలు వస్తాయని అనుకున్నారు. అయితే బీఎస్పీకి వేసే ప్రతి ఓటు బీజేపీకి వేసినట్లే అని ఓటర్లు అనుకోబట్టే బీఎస్పీకి కూడా వేయలేదట. జాట్లలో చదువుకున్న యువతలో కొంత, ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీకి ఓట్లేశారట. గుజ్జర్లు, సైనీలు, లోథ్ లు ఎస్పీ కూటమికి ఓట్లేసినట్లు సమాచారం. మొత్తం మీద బీజేపీకి మొదటి విడత అనుకూలంగా లేదని అర్ధమవుతోంది.