Begin typing your search above and press return to search.

ప్రభుత్వాలపైనే కోర్టు దిక్కరణ కేసులా ?

By:  Tupaki Desk   |   1 May 2021 5:30 PM GMT
ప్రభుత్వాలపైనే  కోర్టు దిక్కరణ కేసులా ?
X
గతంలో సుప్రింకోర్టు ఎప్పుడూ ఇంతస్ధాయిలో కేంద్రప్రభుత్వానికి హెచ్చరికలు పంపినట్లు లేదు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో అనేక అంశాలపై సుప్రింకోర్టు కేంద్రంపై చాలా ఘటుగా స్పందిస్తంది. అంతేకాకుండా తీవ్రమైన హెచ్చరికలు, వ్యాఖ్యలు చేస్తుండటం సంచలనంగా మారింది. అత్యున్నత ధర్మాసనం చేస్తున్న హెచ్చరికలు, వ్యాఖ్యలు చూస్తుంటేనే కరోనా నియంత్రణలో కేంద్రప్రభుత్వం విఫలమైందన్న విషయం జనాలకు స్పష్టంగా అర్ధమైపోతోంది.

తాజాగా కరోనా వైరస్ బాధితుల ఆర్తనాదాలు, సమస్యల బటయప్రపంచానికి తెలియకుండా అడ్డుకుంటే ప్రభుత్వాలపై కోర్టు థిక్కారణ కేసులను నమోదు చేయాల్సుంటుందని చేసిన హెచ్చరిక కలకలం సృష్టిస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని ఓ ఘటనపై స్పందించిన సుప్రింకోర్టు యావత్ దేశానికి హెచ్చరికచేయటం గమనార్హం. బాధితులు తమ బాధలను సమాజంతో పంచుకోవటం తప్పెలాగ అవుతుందంటు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది.

వ్యాక్సిన్ కొరతను, ఆక్సిజన్ అందకపోవటాన్ని, బెడ్లు లేకపోవటం, వైద్య సేవల్లో లోపాల గురించి బాధితులు బాహ్య ప్రపంచానికి తెలియజేయటం తప్పేమీకాదంటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి గట్టిగా తలంటింది. బాధితుడి మీద పెట్టిన కేసును వెంటనే ఎత్తేయాలని పోలీసులను సుప్రింకోర్టు ఆదేశించింది. కరోనా ఉదృతిని జాతీయ సంక్షోభంగా వర్ణించిన సుప్రిం ధర్మాసనం సమస్యలను సమాజం ముందచటంలో తప్పేలేదన్నది. బాధితుల నోర్లు మూయించాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తే తాము చూస్తు ఊరుకునేది లేదని చాలా ఘాటుగానే హెచ్చరించింది.

పైగా టీకాల ధరలపై ఉత్పత్తి కంపెనీల నియంత్రణ ఏమిటంటు కేంద్రాన్ని నిలదీసింది. ఏ రాష్ట్రానికి ఎంత టీకాలు సరఫరా చేయాలన్నది రాష్ట్రాల అవసరాలే కానీ కంపెనీల ఇష్టంకాదని స్పష్టంగా కేంద్రానికి చెప్పింది. రాష్ట్రాల అవసరాలు ఏమిటో కేంద్రం గమనించి దాని ప్రకారమే ఫార్మాకంపెనీల నుండి సరఫరా చేయించాలని గట్టిగా చెప్పింది. మొత్తానికి టీకాల కొరత, ఆక్సిజన్ సమస్యలతో పాటు అనేక అంశాలపై సుప్రింకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చాలా ఘాటుగానే స్పందించింది.