Begin typing your search above and press return to search.
ప్రభుత్వానికి కాపులంటే ధ్వేషమా ?
By: Tupaki Desk | 14 Feb 2022 6:30 AM GMTఏమో బీజేపీ చీఫ్ సోమువీర్రాజుకు ఎందుకీ అనుమానం వచ్చిందో ? మీడియాతో మాట్లాడుతు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ముస్లింలంటే ప్రేమ..కాపులంటే ధ్వేషమా ? అని ప్రశ్నించారు. కాపులంటే ప్రభుత్వానికి ధ్వేషమా అని అడిగిన వీర్రాజు అందుకు కారణాలను మాత్రం లాజికల్ గా వివరించలేకపోయారు.
వీర్రాజు చెప్పిన కారణం ఏమిటంటే ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం కాపులకు మాత్రం రిజర్వేషన్లు కల్పించలేకపోతోంది ? అని నిలదీశారు.
కాపులకు రిజర్వేషన్లు కల్పించటం సాధ్యం కాదని వీర్రాజుకు కూడా బాగా తెలుసు. ముస్లింలకు రిజర్వేషన్ సాధ్యమైందంటే ఆ సామాజికవర్గం వెనకబడుంది కాబట్టి సాధ్యమైంది. కానీ కాపులు బీసీ సామాజికవర్గం పరిధిలోకి రారు. కాపులకు గతంలో 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తు చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సుప్రింకోర్టు కొట్టేసింది.
అన్నీ విషయాలు బాగా తెలిసిన వీర్రాజు కావాలనే జగన్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు మాత్రమే ఈ అంశాన్ని లేవనెత్తినట్లు అర్ధమవుతోంది.
నిజానికి కాపులకు రిజర్వేషన్ల అంశం, పోరాటాలంటే అందరికీ ముందుగా ముద్రగడ పద్మనాభమే గుర్తుకొస్తారు. అలాంటిది ముద్రగడ స్ధానాన్ని తాను వ్యక్తిగతంగా లేదా బీజేపీ భర్తీ చేయాలని అనుకుంటున్నట్లుంది. అందుకనే కాపులకు రిజర్వేషన్ అనే ఉపయోగంలేని అంశాన్ని పట్టుకున్నారు.
పైగా కాపులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టందుకు శక్తవంచన లేకుండా ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. కాపులకు రిజర్వేషన్ సాధ్యంకాని అంశమని అందరికీ తెలుసు.
కాపులంటే జగన్ కు ధ్వేషముంటే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో మ్యాగ్జిమమ్ టికెట్లు ఎందుకిస్తారు ? తర్వాత స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా వీలైనన్ని సీట్లిచ్చారు కదా. తర్వాత కార్పొరేషన్ల భర్తీలో కూడా ప్రాధాన్యతిచ్చారు. కాపులకు రిజర్వేషన్ అన్నది కేవలం రాజకీయ నినాదంగా మాత్రమే ఉపయోగపడుతుంది.
ఇంతకాలం మతపరమైన అంశాలతో జనాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ పెద్ద ప్రయత్నాలే చేసింది. అయితే జనాలెవరు బీజేపీని పట్టించుకోలేదు. దాంతో మతపరమైన రాజకీయాలు చెల్లవని అర్ధమవటంతోనే ఇపుడు కులపరమైన రాజకీయాన్ని మొదలుపెట్టిందని అర్ధమవుతోంది.