Begin typing your search above and press return to search.

కులం కార్డే కుమ్మేసిందా?

By:  Tupaki Desk   |   8 Dec 2022 1:30 PM GMT
కులం కార్డే కుమ్మేసిందా?
X
గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో 7వ సారి విజ‌యం ద‌క్కించుకున్న బీజేపీ.. కులం కార్డుతోనే విజ‌యం ద‌క్కించు కుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. కీల‌క నేత‌లు.. ప్ర‌ధాని మోడీ స‌హా అనేక మంది ప్ర‌చారం చేసినా.. తెర‌చాటున మాత్రం కులం కార్డు బాగానే వ‌ర్క‌వుట్ అయింది. ముఖ్యంగా ప‌టేళ్లు..(ప‌టీదార్‌) బీజేపీ గెలుపును శాసించార‌న‌డంలో సందేహం లేదు.

గుజరాత్‌ జనాభాలో ప‌టేళ్ల‌ సంఖ్య సుమారు 15 శాతం. 1990 నుంచి వీరు అధికార పార్టీల‌ను నిర్ణ‌యిస్తూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే 2015లో హార్దిక్‌ పటేల్‌ సారథ్యంలో పాటీదార్ ఉద్యమం తెర‌మీదికి వ‌చ్చింది. తాము ప్ర‌భుత్వాల‌ను నిల‌బెడుతున్నా.. త‌మ‌కు అన్యం చేస్తున్నార‌ని వారు ఉద్య‌మించారు. అయితే.. అప్ప‌టికే బీజేపీకి మ‌ద్ద‌తుగా వీరు నిలిచారు.

అయిన‌ప్ప‌టికీ.. ప‌టీదార్‌ ఉద్యమ సమయంలో ప్ర‌భుత్వం పోలీసు కాల్పుల‌తో వీరిని లొంగ‌దీసుకుంది. దీంతో 2017 ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకుని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా నిలిచింది. దీనికి కార‌ణం ప‌టేల్ వ‌ర్గ‌మే.

అయితే,తాజా ఎన్నికల్లో మాత్రం బీజేపీ.. పటేల్ ఓటర్ల విషయంలో జాగ్రత్త పడింది. పటేల్‌ల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు సంచ‌ల‌న నిర్ణ‌యాలే తీసుకుంది. కేంద్ర హొం మంత్రి అమిత్ షాకు అత్యంత మిత్రుడైన‌ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీని ప‌క్క‌న పెట్టిందంటే.. ప‌టేల్ కోసం ఎలాంటి వ్యూహం వేసిందో తెలుస్తుంది.

అదేస‌మ‌యంలో ప‌టీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ను కాంగ్రెస్‌కు దూరం చేసి.. త‌న‌లో క‌లుపుకుంది. తాజాగా ఎమ్మెల్యే సీటు ఇచ్చింది. ఇక‌, కీల‌క‌మైన ఈ డ‌బ్ల్యుఎస్ రిజర్వేషన్ల రూపంలో పటేల్‌లకు మేలు చేసింది. దీంతో ప‌టేల్ కుల‌స్తుల ఓటు కార్డు.. బీజేపీకి ఎంతో మేలు చేసింది.

ఇక‌, మ‌రో కులం ఎస్సీలు. రాష్ట్రంలో 13 ఎస్సీ రిజర్వుడ్ స్థానాలున్నాయి. అదేస‌మ‌యంలో అన్ని నియోజ‌క వ‌ర్గాల్లోనూ క‌లిపి 8-9 శాతం మంది ఓట‌ర్లు ఉన్నారు. రాష్ట్రంలో 1995 నుంచీ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలను బీజేపీనే దక్కించుకుంటోంది.

2017లో మాత్రం.. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో బీజేపీ వెనకబడిపోయింది. మొత్తం 13 స్థానాల్లో ఏడింటిని బీజేపీ గెల్చుకోగా, కాంగ్రెస్ ఐదు చోట్ల మాత్రం విజ‌యం ద‌క్కించుకుంది. తాజా ఎన్నిక‌ల్లో మాత్రం బీజేపీ దళిత ఓటర్లను బాగానే ఆకట్టుకుంది. పలువురు దళిత నేతలకు వివిధ ప్రభుత్వ సంస్థల్లో పదవులు కట్టబెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల కోసం ప్రవేశ పెట్టిన పథకాలు బీజేపీకి క‌లిసి వ‌చ్చాయి.

అదేవిధంగా మ‌రో కులం.. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివాసీలు కాంగ్రెస్‌ పార్టీ వైపే ఉన్నారు. 2017 ఎన్నికల్లో 27 రిజర్వుడ్‌ సీట్లకుగాను కాంగ్రెస్‌ 15 గెల్చుకోగా.. బీజేపీ 8 చోట్ల మాత్ర‌మే నెగ్గింది. ఈసారి ఆదివాసీ సీట్లను బీజేపీ గెలుపొందేందుకు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము కార్డును వాడుకున్నారు. ప‌లితంగా ఇక్క‌డ భారీ విజ‌యం న‌మోదు చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.