Begin typing your search above and press return to search.

సంచలన నినాదాన్ని చూసి చదవటం ఏమిటి జగన్?

By:  Tupaki Desk   |   24 Dec 2022 4:13 AM GMT
సంచలన నినాదాన్ని చూసి చదవటం ఏమిటి జగన్?
X
అందునా అధికారం చేతిలో ఉన్న అధినేతకు ఉండే అడ్వాంటేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతటి సానుకూలత ఉన్న వేళ.. తనలోని లోపాల్ని సరిద్దిద్దుకొని.. మరింత బలోపేతం కావటానికి ప్రయత్నిస్తుంటారు. గడిచిన పదేళ్ల కాలాన్నే తీసుకుంటే ఏపీ రాజకీయాల్లో కీలకంగా ముగ్గురు అధినేతలు కనిపిస్తారు. వారిలో ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే.. విపక్ష నేత.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. ముచ్చటగా మూడో వ్యక్తి పవర్ స్టార్ కమ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్.

ఈ ముగ్గురిని చూస్తే.. జగన్మోహన్ రెడ్డి మినహా మిగిలిన ఇద్దరి ప్రసంగాలు చేసే తీరు.. చెప్పాల్సిన విషయాన్ని చెప్పే విధానంలో మెరుగుదల కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. పవన్ కల్యాణ్ విషయాన్నే తీసుకుంటే.. ఆయన మాటల మధ్యలో జంపింగ్స్ ఎక్కువ. చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పే వేళలో ఆయనలో తడబాటు స్పష్టంగా కనిపిస్తుంటుంది.

ఒక విషయం గురించి మాట్లాడుతూ మరో విషయంలోకి వెళ్లపోయే ఇబ్బందిని ఆయన ఎదుర్కొనే వారు. అయితే.. ఇటీవల కాలంలో ఆయన తనలోని లోపాన్ని సరిచేసుకునేలా కసరత్తు చేస్తున్నారు. గతంతో పోలిస్తే వర్తమానంలో పవన్ ప్రసంగాల్లో వాడివేడితనం పెరగటమే కాదు.. పేపర్లో ఉన్నది చూసి చదివే అలవాటు లేకుండా చేసుకుంటున్నారు. అప్పటికప్పుడు విషయాల్ని ఇంప్రూవ్ చేసుకునే ధోరణి కనిపిస్తోంది.

ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సరైన రీతిలో ప్రసంగించే విషయంలో ఆయన వెనుకపడి ఉంటారని.. ఆయన నోరు తెరిస్తే.. ఏదో సైన్స్ పాఠం విన్నట్లుగా డ్రైగా ఉంటుందన్న విమర్శను అధిగమించే విషయంలో ఆయన పడిన కష్టం.. అంతకుమించిన శ్రమ.. ఇప్పుడు ఆయన ప్రసంగాల్ని విన్నప్పుడు ఇట్టే అర్థమవుతుంది. డెబ్భై ప్లస్ వయసులో ఆయన చేస్తున్నకఠోర సాధన ఆయన ప్రసంగాలకు ఉన్న చెడ్డపేరును పోగొట్టేస్తున్నాయి.

ఇక.. మిగిలింది ముఖ్యమంత్రి కమ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఆయన మాటల్ని చెప్పే విషయంలో పడే తడబాటు అంతా ఇంతా కాదు. విపక్ష నేతగా కంటే కూడా ప్రభుత్వాధినేతగా ఆయనలో తడబాటు మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఎవరో రాసిచ్చిన మాటల్ని.. పేపర్లో చదువుతూ చెప్పటం ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని కీలక వ్యాఖ్యలు.. స్టేట్ మెంట్లను సైతం పట్టి.. పట్టి చదవటం కనిపిస్తుంది. దీని వల్ల ఎఫెక్టు ఎక్కువగా లేని పరిస్థితి.

ప్రసంగ పాఠం బాగుంటే సరిపోదు.. ఆ ప్రసంగాన్నిచెప్పాల్సిన వ్యక్తి.. చెప్పాల్సిన తీరులో చెబితే ఆ లెక్కలే వేరు అని చెబుతున్నారు. తాజాగా ఇదే నా రాష్ట్రం.. ఇక్కడే నా నివాసం.. ఇక్కడే నా మమకారం.. ఐదు కోట్ల ప్రజలే నా కుటుంబం.. ప్రజల సంక్షేమమే నా విధానం అంటూ ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్య ఆకట్టుకునేలా ఉంది. అయితే.. అంతటి పవర్ ఫుల్ వ్యాక్యాల్ని పేపర్ మీద చూస్తూ.. పొడి పొడిగా చెబుతూ చివర్లో ఎమోషన్ పిండే ప్రయత్నం చేశారు. అలాకాకుండా కాస్తంత హోంవర్కు చేసుకొని పేపర్ తో అవసరం లేకుండా.. మనసులో నుంచి వస్తున్నట్లుగా ఉంటే మరింత ఎఫెక్టివ్ గా ఉంటుందన్న వషయాన్ని జగన్ గుర్తించాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.