Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ధైర్యం అదేనా?

By:  Tupaki Desk   |   21 Dec 2021 6:00 AM GMT
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ధైర్యం అదేనా?
X
రాజ‌కీయ నేత‌ల‌కు ఉండాల్సింది ఏంటి? ముఖ్యంగా సొంత పార్టీ పెట్టుకున్న వారికి వ్యూహం ఎలా ఉండా లి? పార్టీని ఎలా బ‌లోపేతం చేసుకోవాలి? అంటే.. ఎవ‌రైనా చెప్పే స‌మాధానం.. వెంట‌నే ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలి. పార్టీని బ‌లోపేతం చేసుకునేలా.. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవాలి.

వారి స‌మ‌స్య‌ల‌పై నిరంత‌రం పోరాటం చేయాలి. నేను ఉన్నాను.. అంటూ.. వారిలో భ‌రోసాని నింపాలి. అంతేకాదు.. ఒక బ‌ల‌మైన ప్ర‌త్యామ్నాయంగా కూడా ప్ర‌జ‌ల‌కు క‌నిపించాలి. అప్పుడే.. ఏ నాయ‌కుడైనా.. పార్టీ అయినా.. బ‌లోపేతం అయ్యేది.

గ‌తంలో వ‌చ్చిన రెండు పార్టీల‌ను తీసుకుంటే.. అవి అలానే వ్య‌వ‌హ‌రించాయి. ఒక‌టి అన్న నంద‌మూరి రామారావు స్థాపించిన టీడీపీ. పార్టీ పెట్ట‌గానే ఆయ‌న‌.. ప్ర‌జల్లోకి వెళ్లారు. అక్క‌డే ఉన్నారు.

అక్క‌డే తిన్నా రు. అక్క‌డే నిద్రించారు. రోడ్డు ప‌క్క‌నే స్నానాలు చేశారు. ప్ర‌జ‌ల్లో భారీ ఎత్తున సింప‌తీ ద‌క్కించుకున్నారు. ఇది అన‌తి కాలంలోనే ఆయ‌న‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చింది. ఇక‌, వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా పార్టీ పెట్టిన వెంట‌నే ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. ఓదార్పు యాత్ర‌లు.. ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌ల పేరుతో నిత్యం ప్ర‌జ‌ల్లోనే తిరిగారు. ఇది కూడా ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చింది.

మ‌రి.. కొత్త‌గా పార్టీలు పెట్టిన వారు ఇలా ఏదో ఒక వ్యూహంతో ప్ర‌జ‌లను క‌లిస్తే.. ప్ర‌శ్నిస్తానంటూ.. పార్టీ పెట్టిన‌.. ప‌వర్ స్టార్ జ‌న‌సేనాని .. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకుఇలా నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉండ‌డం లేదు..? ఎందుకు అప్పుడ‌ప్పుడు వ‌చ్చి చూసి వెళ్తున్న‌ట్టుగా.. వ్య‌వ‌హ‌రిస్తున్నారు? మ‌రి ఇలా అయితే.. పార్టీ బ‌ల‌ప‌డేనా? పార్టీ అధికారంలోకి వ‌స్తుందా? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

వాస్త‌వానికి ప‌వ‌న్‌కు మంచి ఆలోచ‌న‌లు ఉన్నాయి. స‌మ‌స్య‌లపై అవ‌గాహ‌న కూడా ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న‌.. మాత్రం విజిటింగ్ నేత‌గానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

దీనికి కార‌ణం ఏంటి? మ‌రీ ముఖ్యంగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యంపై లేదా..ఎన్నిక‌ల్లో తాను ప్ర‌త్యామ్నా యం అవుతాన‌నే ధైర్యం ఎలా వ‌చ్చింది? అనేవి ప్ర‌శ్న‌లు. వీటికి మేధావులు చెబుతున్న మాట‌... ఆశ్చ‌ర్య‌క రంగా ఉంది. ఎన్టీఆర్ మాదిరిగానో.. జ‌గ‌న్ మాదిరిగానో.. ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం లేద‌ని వారు అంటున్నారు.

యూత్‌లో ప‌వ‌న్‌కు భారీ ఎత్తున ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న ఎక్క‌డ స‌భ నిర్వ‌హించినా.. వేలాదిగా యూత్ త‌ర‌లివ‌స్తున్నారు. ఆయ‌న వీరిని ఓటు బ్యాంకుగా మార్చుకుంటే.. ఇక‌, తిరుగే ఉండ‌ద‌ని అంటున్నారు మేధావులు. ఇప్పుడు ప‌వ‌న్ ఈ దిశ‌గానే ఆలోచ‌నచేస్తున్నారు.

మ‌రో.. కీల‌క అంశం.. ప‌వ‌న్‌కు క‌లిసి వ‌స్తున్న సామాజిక వ‌ర్గం. ఆయ‌న అధికారంలో ఉన్నా లేకున్నా.. పార్టీ అధినేత‌గాఆయ‌న‌కు కాపుల మ‌ద్ద‌తు సంపూర్ణంగా ఉంది. నేరుగా ప‌వ‌న్ వ‌చ్చి ప్ర‌చారం చేయ‌క‌పోయినా.. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లోనూ.. గ‌తంలో జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ.. జ‌న‌సేన అభ్య‌ర్థులు చాలా మంది గెలుపుగుర్రం ఎక్కారు.

దీనికి కారణం.. ప‌వ‌న్‌పై సామాజిక‌వ‌ర్గం పెంచుకున్న అబిమాన‌మే న‌ని అంటున్నారు. ఇది చెక్కుచెద‌ర‌ద‌ని మేధావులు సైతం చెబుతున్నారు. ఇది దాదాపు 6-7 శాతం ఓటుబ్యాంకును జ‌న‌సేన‌కు అందిస్తుంద‌ని అంటున్నారు.

అదేస‌మ‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. త‌న అవ‌స‌రం ఉన్న పార్టీలు పెరుగుతున్నాయ‌ని.. కూడా ప‌వ‌న్ భావిస్తున్నారు. వీటిలో టీడీపీ ప్ర‌ధానంగా త‌న‌ను సంప్ర‌దిస్తుంద‌ని.. త‌న‌తో పొత్తు పెట్టుకుంటుంద‌ని కూడా ప‌వ‌న్ భావిస్తున్నారు. ఇది త‌న‌కు లాభించే అంశ‌మ‌ని కూడా ప‌వ‌న్ భావిస్తున్నారు.

క‌నీసం 50 నుంచి 60 సీట్ల‌లో పోటీ చేసినా.. అటు టీడీపీ మ‌ద్ద‌తు.. ఇటు త‌న హ‌వా రెండూ క‌లిసి.. ఖ‌చ్చితంగా 40 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌నే లెక్క‌లు వేసుకుంటున్నార‌ని అంటున్నారు. ఈ కార‌ణంగానే ఆయ‌న నేరుగా నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండ‌క‌పోయినా.. ప్ర‌జ‌లు మాత్రం త‌న‌ను దీవిస్తార‌నే ఆశ‌తో అయితే ఉన్నార‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.