Begin typing your search above and press return to search.
భార్యను భర్త రేప్ చేస్తే.. అది నేరమేనా?
By: Tupaki Desk | 17 Jan 2023 10:37 AM GMTఅదేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే!! కట్టుకున్న భార్యను ఆమెకు ఇష్టం లేకుండా.. భర్త శృంగారం చేయడాన్ని రేప్‌గానే పరిగణిస్తూ.. సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. అయితే.. ఇది నేరమా? కాదా? అనేది మాత్రం తేల్చలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా భార్యను భర్త రేప్ చేస్తే.. నేరంగా పరిగణించా లా? వద్దా.. అనే ధర్మ సందేహం వచ్చింది. దీంతో ఈ విషయాన్ని తేల్చాలంటూ.. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 15లోగా దీనిపై స్పందించాలని కోరింది.
అసలు ఏం జరిగిందంటే..
ఐపీసీలోని సెక్షన్ 375 ప్రకారం.. మైనర్ కాని భార్యతో భర్త శృంగారం జరపడం నేరం కాదు. అయితే.. ఈ సెక్షన్ రాజ్యాంగబద్ధతను కొందరు సవాలు చేశారు. లైంగికంగా వేధించే భర్తతో కాపురం చేసే మహిళ హక్కుల్ని హరించేలా ఈ సెక్షన్ ఉందని పేర్కొన్నారు.
వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. భార్య సమ్మతి లేకుండా శృంగారం చేసే భర్తను నేరస్థుడిగా పరిగణించవచ్చని డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది.
అయితే.. అదే ధర్మాసనంలో మరో సభ్యుడైన జస్టిస్ హరిశంకర్.. ఇందుకు భిన్నంగా తీర్పు ఇచ్చారు. ఐపీసీలోని సెక్షన్ 375 రాజ్యాంగవిరుద్ధం కాదని.. ఆర్టికల్ 14, 19(1) (A), 21లను ఉల్లంఘించినట్లు కాదని వ్యాఖ్యానించారు. "వివాహితలు, అవివాహితల గౌరవాన్ని వేర్వేరుగా చూడలేము.
పెళ్లయినా.. కాకున్నా.. ఇష్టం లేని లైంగిక చర్యను నిరాకరించే హక్కు ప్రతి మహిళకు ఉంటుంది" అని ధర్మాసనం పేర్కొంది. మరోవైపు కర్ణాటక కేసులో భార్యపై అత్యాచారం చేసిన భర్తను మినహాయించడం ఆర్టికల్ 14కు విరుద్ధమని గతేడాది మార్చిలో ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. మొత్తంగా చూస్తే.. భార్యను రేప్ చేస్తే.. నేరంగా పరిగణించాలా? అనేది పెద్ద ప్రశ్న. మరి దీనిపై కేంద్రం ఏం సమాధానం చెబుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.