Begin typing your search above and press return to search.
పవన్ కు చేతనైంది.. ఆలీకి చేతకానిది ఇదే!
By: Tupaki Desk | 25 Feb 2021 2:30 AM GMTఆదర్శాలు చెప్పటం చాలా సులువు. పాటించటం చాలా కష్టం. చేసే పనులు మాత్రమే చెబుతాననే వారు రాజకీయాల్లో చాలా తక్కువగా రాణిస్తారు. తిమ్మిని బమ్మిని చేయాలి. బమ్మిని తిమ్మిని చేయాలి. అప్పుడు మాత్రమే అవకాశం ఉంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. కానీ.. అలాంటివేమీ లేకుండా మనసును చాలా సింఫుల్ గా.. ప్లెయిన్ గా ఉంచుతూ స్నేహానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ.. రాజకీయాల్ని వేరుగా చూడటం చెప్పటం చాలా సులువు కానీ.. ఆచరణ చాలా కష్టం. అలా ప్రయత్నించిన వారంతా ఫెయిల్ అయ్యారే తప్పించి.. సక్సెస్ కాలేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇందుకు మినహాయింపు కాదన్నది మర్చిపోకూడదు.
ఇక్కడ రెండు ఉదాహరణలు ప్రస్తావిస్తే.. విషయం మీకు ఇట్టే అర్థమైపోతుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే తీసుకుందాం. ఆయన ఎవరితో స్నేహంగా ఉంటారో? ఎవరిని దూరం పెడతారో చెప్పటం చాలా సులువు. వ్యక్తిగతంగా చాలా మంచి స్నేహితులు.. రాజకీయంగా మాత్రం భిన్నధ్రువాలు లాంటి వారు.. జగన్ చుట్టూ కనిపిస్తారేమో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అసలు.. రాజకీయంగా పడదు కానీ.. వ్యక్తిగతంగా చాలా దోస్తులమన్న మాటతోనే ఇబ్బంది అంతా. జగన్ చుట్టూ ఉన్న వారు కానీ.. ఆయన విధేయుల్లో ఒక్కరంటే ఒక్కరన్న ఇలాంటోళ్లు ఉన్నారా?
కట్ చేస్తే.. ప్రధాని మోడీ గురించి తీసుకుందాం. ఆయన గురువుకే పంగనామం పెట్టిన యవ్వారం. ఎల్ కే అద్వానీ అన్న మహానేత లేకుంటే నరేంద్ర మోడీ అనే వారు ఉన్నారా? అలాంటి ఆయన అద్వానీ లాంటోడ్ని ఏం చేశారు? ఎలా పక్కన పెట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా చూసినప్పుడు మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయంగా అస్సలు కుదరదని చెబుతారు.
కానీ.. అందుకు మినహాయింపుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి చెప్పాలి. సినిమాల్లో నటించే సమయంలోనూ.. ఆయన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సందర్భంలోనూ ఆయన వ్యక్తిగత.. రాజకీయ సంబంధాలు వేర్వేరు అన్నట్లు చూశారు. నిజానికి ఇలాంటి ధోరణి ఏ మాత్రం మంచిది కాదు. ఇలాంటి తీరుతో.. పవన్ కు సన్నిహితులుగా చెప్పేవారు.. రాజకీయ వ్యాఖ్యలు చేసిన ఆయన్ను ఎంతలా డ్యామేజ్ చేశారో చెప్పాల్సిన అవసరమే లేదు.
హాస్యనటుడు అలీ సంగతే చూద్దాం. ఆయనకు.. పవన్ కు మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ 27 చిత్రాల్లో నటిస్తే.. అలీకి పాతిక సినిమాల్లో నటించారు. మరే నటుడికి ఇవ్వనంత ప్రాధాన్యత పవన్ అలీకి ఇచ్చేవారు. మరి.. అలాంటి అలీ రాజకీయంగా తనకున్న భావజాలానికి దగ్గర అంటూ వైసీపీలో జాయిన్ అయ్యారు. సరే.. అయితే అయ్యారనుకుందాం. కానీ.. పవన్ మీద మొహమాటం లేకుండా వ్యాఖ్యలు చేసేశారు. నిష్ఠూరాలు ఆడారు. ఇవన్నీ విన్న పీకే అభిమానులు ఎంతలా హర్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేలేదు.
నిజానికి వ్యక్తిగతంగా దగ్గర.. రాజకీయంగా దూరమనే వాళ్లను అస్సలు దగ్గరకు రానివ్వకపోవటమే మంచిది. ఎందుకంటే.. ఇలాంటి వారి వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. వైరిపక్షానికి చెందిన వారు.. తమ అభిమానులుగా.. ఫాలోయర్లుగా.. స్నేహితులుగా ఉండటం వల్ల.. వారికి తెలియాల్సిన విషయాలు తెలీటమే కాదు.. రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకోవటానికి అవకాశం ఉంటుందన్నది మర్చిపోకూడదు. తాజాగా అలీ ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు పవన్ వెళ్లారు.కుశల ప్రశ్నలు మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా పవన్ - అలీ మధ్య ఎలాంటి కలతలు లేవని.. తనను చాలా చక్కగా పవన్ ఆదరించినట్లుగా ఆలీ చెబుతున్నారు. ఇదంతా చూస్తే.. పవన్ చేతకానితనంతో కూడుకున్న మంచితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య రాజకీయాలు వేరు.. పార్టీలు వేరు అనేదే అర్థం లేని కాన్సెప్టు. ఎందుకంటే.. పవన్ లాంటి మంచి స్నేహితుడిలో లేని రాజకీయ మంచి.. మరెవరి దగ్గరో ఎందుకు ఉంటుంది?
తనకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి.. రాజకీయంగా మాత్రం వేరే వారికి సన్నిహితంగా ఉండటం వినేందుకే విచిత్రంగా ఉంటాయని చెప్పాలి. ఇలాంటి తీరుతో మంచి స్నేహాన్ని ఎప్పటికిప్పుడు వాడుకుంటారే కానీ.. వారు మాత్రం మిత్రుడికి సాయం చేసేది కనిపించదు. ఈ విషయాన్ని ఇప్పటికైనా పవన్ గుర్తిస్తే మంచిది. అంతేకాదు.. స్నేహితుడిగా పవన్ కు చేతనైంది అలీకి ఎందుకు చేతకాదు?
అందరూ మంచిగా ఉంటారనుకోవటం విడిగా బాగుంటుంది కానీ ప్రజాజీవితంలో ఉన్న వారు అస్సలు అనుకోకూడదు. ఎందుకంటే.. ప్రత్యర్థులు దెబ్బ తీయటానికి ఎన్నో ఎత్తులు వేస్తుంటారన్నది పవన్ లాంటోళ్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. స్నేహం స్నేహంతోనే ఆగటం లేదన్న వాస్తవాన్ని జనసేనాధినేత మర్చిపోతే.. ఆయనకే నష్టం. రాజకీయాల్లో హత్యలు ఉండవు. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి.