Begin typing your search above and press return to search.

పాద‌యాత్ర స‌రే.. టార్గెట్ రీచ్ కావ‌డ‌మే క‌ష్టమా... లోకేష్ ఏం చేస్తారు..?

By:  Tupaki Desk   |   16 Nov 2022 4:02 AM GMT
పాద‌యాత్ర స‌రే.. టార్గెట్ రీచ్ కావ‌డ‌మే క‌ష్టమా...  లోకేష్ ఏం చేస్తారు..?
X
జ‌న‌వ‌రి 27వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర నిర్వ‌హించాల‌ని టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ నిర్ణ‌యించుకున్నారు. ఆ రోజు ఆయ‌న మాతృమూర్తి భువ‌నేశ్వ‌రి వీర తిల‌కం దిద్ది నారా లోకేష్‌ను క‌ద‌న రంగంలోకి దింప‌నున్నారు. అటు నుంచి ఆయ‌న ఏకంగా 400 రోజుల పాటు పాద‌యాత్ర నిర్వ‌హిస్తారు. అయితే.. దీని వెనుక నారా లోకేష్ కానీ, పార్టీ నేత‌లు కానీ పెట్టుకున్న‌ల‌క్ష్యం ఏంటి? అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు సుదీర్ఘ పాద‌యాత్ర చేసిన రికార్డు జ‌గ‌న్‌కు ఉంది. దీనిని తుడిపేసేయాల‌నేది ఒక ల‌క్ష్యం. రెండు.. జ‌గ‌న్ మాదిరిగా అధికారంలోకి వ‌చ్చేయాల‌నేది.

అయితే, ఇవి సాధ్య‌మేనా అంటే, మొద‌టి ల‌క్ష్యం సాధ్యం.. సాకారం కావొచ్చు. ఎందుకంటే జ‌గ‌న్ 341 రోజుల న‌డిచి.. మ‌ధ్య‌లో విరామం ఇచ్చారు కూడా! ఏకంగా 3,648 కిలో మీట‌ర్లు ముందుకు సాగారు. ఇక‌, ఇప్పుడు దీనికి ప్ర‌తిగా నారా లోకేష్‌.. ఏకంగా 400 రోజులు న‌డ‌వ‌నున్నారు. జిల్లాల‌కు జిల్లాల‌ను ఆయ న చుట్టేయ‌నున్నారు. అదేస‌మ‌యంలో విరామ‌మెరుగ‌ని బాట‌సారిగా కూడా రికార్డు సృష్టించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇవ‌న్నీ సాధ్య‌మే. అయితే, అధికారంలోకి రావ‌డం.. జ‌గ‌న్ తెచ్చుకున్న‌న్ని(151) సీట్లు తెచ్చుకోవ‌డం వంటి కీల‌క విష‌యాల్లో లోకేష్ వ్యూహం ఏంటి? అనేది ప్ర‌శ్న‌.

జ‌గ‌న్ పాద‌యాత్ర చేసి అధికారంలోకి వ‌చ్చారు కాబ‌ట్టి నేను కూడా పాద‌యాత్ర చేసి అధికారంలోకి వ‌చ్చేస్తాను.. అనే విధంగా లోకేష్ ఆలోచ‌న చేస్తే.. ఇబ్బంది త‌ప్ప‌దు. ఎందుకంటే.. పాద‌యాత్ర చేసిన జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల‌కు అక్క‌డిక‌క్క‌డే అనేక హామీలు గుప్పించారు. మ‌రి ఈ త‌ర‌హా హామీలు ఇవ్వ‌డంలో లోకేష్ పాత్ర ఏంటి? అదేవిధంగా టికెట్ల‌ను కూడా జ‌గ‌న్ అప్ప‌ట్లో నే ప్ర‌క‌టించారు. క‌ర్నూలులో కంగాటి శ్రీదేవి, గుంటూరు చిల‌క‌లూరి పేట‌లో విడ‌ద‌ల ర‌జ‌నీ వంటివారికి పాద‌యాత్ర స‌మ‌యంలోనే టికెట్ల హామీ ఇచ్చారు.

మ‌రి ఇవ‌న్నీ లోకేష్ చేయ‌గ‌ల‌రా? ఆయ‌న‌కు అస‌లు ఆ అధికారం ఉందా? ఎందుకంటే పార్టీ అధినేత చంద్ర‌బాబు. సో.. ఏదైనా ఆయ‌నే నిర్ణ‌యం తీసుకోవాలి. సో.. ఈ ప‌రిస్థితిని లోకేష్ ప్రాథ‌మికంగా అధిగ‌మిస్తేనే నాయ‌కుల్లో బ‌లం పెరుగుతుంది, లోకేష్ ప‌ట్ల గౌర‌వం పెరుగుతుంది. ఇక‌, మ‌రోకీల‌క విష‌యం ఎక్క‌డ‌క‌క్క‌డ త‌మ్ముళ్ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు జోరుగా సాగుతోంది. దీనిని స‌రిదిద్ద‌డం చంద్ర‌బాబుకే సాధ్యం కావ‌డం లేద‌నే వాద‌న ఉంది. ఇప్పుడు లోకేష్ రంగంలోకి దిగిన త‌ర్వాత దీనిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారు అనేది కూడా ఆస‌క్తిగా మారింది.

ఇవ‌న్నీ ఇలా ఉంటే, వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును సానుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేస్తారా? లేక టీడీపీ సొంత ఓటు బ్యాంకును బ‌లోపేతం చేస్తారా? అనేది కూడా సందేహ‌మే. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకుపైనే ఆధార‌ప‌డి పాద‌యాత్ర చేస్తే.. దానివ‌ల్ల కొంత మేర‌కే ఫ‌లితం వుంటుంది. అలా కాకుండా పార్టీని బ‌లోపేతం చేయ‌డం అత్యంత కీల‌కం. ఇక్క‌డే లోకేష్‌ను వ్య‌తిరేకించే సీనియ‌ర్ నేత‌ల వ‌ర్గాన్ని ఆయ‌న త‌న‌వైపు తిప్పుకోవాల్సి ఉంటుంది. అదేస‌మ‌యంలో వైసీపీ నుంచి వ‌చ్చే క‌వ్వింపులు.. ప‌దునైన విమ‌ర్శ‌లు.. పాద‌యాత్ర‌పై అవ‌హేళ‌న‌లు.. ఇలా అనేక సంకెళ్ల‌ను ఎదుర్కొంటే త‌ప్ప‌.. లోకేష్ టార్గెట్ అయితే పూర్తికాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఆయ‌న ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.