Begin typing your search above and press return to search.

ఇక్కడ పరపతిపాయే.. జాతీయ స్థాయిలోనూ కేసీఆర్ ను నమ్మడం లేదా?

By:  Tupaki Desk   |   5 Sep 2022 8:38 AM GMT
ఇక్కడ పరపతిపాయే.. జాతీయ స్థాయిలోనూ కేసీఆర్ ను నమ్మడం లేదా?
X
నమ్మకం.. విశ్వసనీయత.. రాజకీయాల్లో ఈ రెండూ కీలకం.. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్న కేసీఆర్ ఆ మాట తప్పి తెలంగాణలో పోటీచేసి ఏకంగా కాంగ్రెస్ ను ఓడించి అధికారం సంపాదించారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ నే లేకుండా చేస్తున్నారు. అందుకే కేసీఆర్ పాలిటిక్స్ ధాటికి ఎవరూ ఆయనను నమ్మడం లేదు. బీజేపీ కూడా మొదట్లో సాన్నిహిత్యం పెట్టి ఇప్పుడు కయ్యానికి కాలుదువ్వుతోంది.

బీజేపీపై కోపంతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి ఆ పార్టీని ఓడించాలని కంకణం కట్టుకున్న కేసీఆర్ తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. ఆయన ఒక్కడ అడుగు ముందుకేస్తే బీజేపీ ఏదో ఒక ఇష్యూను తీసుకొచ్చి పది అడుగులు వెనక్కి లాగుతోంది.

మొదట ఫెడరల్ ఫ్రంట్ అన్న కేసీఆర్ ఆశలు నెరవేరలేదు. ఆ తర్వాత థర్డ్ ఫ్రంట్ అంటే ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ అంటూ కొత్త పార్టీ ఎత్తుకున్నారు. రాజకీయ ప్రయోగాలు చేస్తున్నారు.. ప్రారంభదశలోనే తేలిపోతున్నారు.

2018 ముందస్తు ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇలానే రాష్ట్రాల్లో తిరిగి భంగపాటుకు గురయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా మూడో ఫ్రంట్ సాధ్యం కాదని తేలిపోయింది. బీజేపీ అఖండ మెజార్టీతో గెలవడంతో సైలెంట్ అయిపోయారు.

ఇప్పుడు మరోసారి బీజేపీని ఓడించాలని పంతం పట్టి జాతీయ రాజకీయాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేంద్రాన్ని శాసించే రీతిలో ప్రాంతీయ పార్టీలన్నింటిని ఒకే గాటున కట్టడానికి రెడీ అయ్యారు.బీహార్ వెళ్లి మోడీతో తెగదెంపులు చేసుకున్న నితీష్ ను కలిసి రాజకీయం పండించారు. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పర్యటించారు. రెండు సార్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఇప్పుడు ముచ్చటగా మూడోసారి 2024 ఎన్నికల ముందర కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టడానికి రెడీ అయ్యారు. కేసీఆర్ నాయకత్వంలో నడిచేందుకు ప్రాంతీయ పార్టీల నేతలు ఎవరూ సిద్ధంగా లేరు. చివరకు తేజస్వి యాదవ్, హేమంత్ సోరన్ లాంటి వాళ్లు కూడా సుముఖంగా లేనట్టు తెలుస్తోంది.

ప్రాంతీయ పార్టీలతో కూటమికి ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో జాతీయ స్థాయిలో కొత్త పార్టీ దిశగా కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. రైతులందరినీ ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ ఉద్యమం తరహా దేశవ్యాప్తంగా ఉద్యమించి మూడో ప్రత్యామ్మాయంగా నిలవాలని చూస్తున్నారు. కేసీఆర్ ఆశలు ఏమేరకు నెరవేరుతాయన్నది వేచిచూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.