Begin typing your search above and press return to search.
కాపుల ఓట్లు చీల్చడం కేసీఆర్‌కు సాధ్యమేనా..?
By: Tupaki Desk | 6 Jan 2023 11:30 PM GMTఏపీలో కాపుల ఓట్లు చీల్చడమే లక్ష్యంగా బీఆర్ ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడు గులు వేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. కాపు నాయకులు చాలా మంది దీనిపై కామెంట్లు చేస్తున్నా రు. ఇక, బీజేపీలోని ఒకరిద్దరు నాయకులు కూడా సామాజికవర్గాలకు అతీతంగా.. బీఆర్ ఎస్ అధినేతను తప్పుబట్టారు. వీరు చెబుతున్నది ఏంటంటే.. ఏపీలో కాపు సామాజిక వర్గాన్ని ఐక్యం చేసి.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టాలని జగన్ భావిస్తున్నారు. అయితే.. దీనికి కేసీఆర్ గండి కొడుతున్నారనే!
ఈ క్రమంలో జగన్ కూడా కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ఇద్దరూ కలిసి కుట్రలు పన్నుతు న్నారని కూడా వారు చెబుతున్నారు. అయితే.. దీనిలో ఎంత మేరకు నిజం ఉన్నదనేది పక్కన పెడితే.. జరుగుతున్నపరిణామాలను గమనిస్తే.. తోట చంద్రశేఖర్ వంటివారిని కేసీఆర్ తన పార్టీలోకి తీసుకోవడం.. ఆయనకు బీఆర్ ఎస్ ఏపీ పగ్గాలు అప్పగించడం వంటివి నిజంగానే కాపులను టార్గెట్ చేసుకుని జరుగుతు న్నవని అంటున్నారు.
అయితే.. తోట చంద్రశేఖర్‌కు పెద్దగా రాజకీయ దూకుడు లేదు. అలాంటి వారి వల్ల కాపులు ఏకమై.. పవన్ ను దూరం చేస్తారని అనుకోవడం అసలు విషయమే కాదు. ఎందుకంటే.. బీఆర్ ఎస్ వల్ల.. ఏపీ విడిపో యిందనే ప్రచారం ఉంది.కేసీఆర్ ఏపీ ప్రజలను తిట్టిపోశారు. ఇప్పుడు ఆ వీడియోలను కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పైగా.. బీఆర్ ఎస్ ఏపీలో అధికారంలోకి వచ్చేస్థాయి కానీ, ప్రతిపక్ష హోదా దక్కించుకునే స్థితి కానీ లేదు.
ఇక, పార్టీలో చేరిన వారు.. కూడా, ఆయారాం.. గయారాం బ్యాచ్ నాయకులే అనే మాట కూడా వినిపిస్తోంది. రావెల అయినా.. తోట అయినా.. ఇప్పటికే నాలుగు పార్టీలు మారారు. సో.. వీళ్లను నమ్ముకుని కాపు నాయకులు బీఆర్ ఎస్ లో చేరతారని కానీ, బీఆర్ ఎస్‌కు ఓటే స్తారని.. అనుకునేవారు, నమ్మేవారు ఎవరూ లేరు. అంతేకాదు.. అసలు బీఆర్ ఎస్ అనే పార్టీ ఉన్నట్టుగా కూడా గుర్తించే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి సమయంలో కేసీఆర్ కాపులను విడదీయడం.. పవన్‌కు దూరం చేయడం కల్లేనని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.