Begin typing your search above and press return to search.

దేశంలో 'టీ20' వరల్డ్ కప్ నిర్వహణ సాధ్యమేనా? మరో దేశానికి తరలించక తప్పదా?

By:  Tupaki Desk   |   28 April 2021 1:30 AM GMT
దేశంలో టీ20 వరల్డ్ కప్ నిర్వహణ సాధ్యమేనా? మరో దేశానికి తరలించక తప్పదా?
X
మన దేశంలో కరోనా పెరుగుతున్న నేపథ్యంలో టీ20 వరల్డ్​ కప్​ నిర్వహణ సాధ్యమేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఐపీఎల్​ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్​ నిర్వహణపై కూడా పలు అభ్యంతరాలు వస్తున్నాయి. దేశంలో ఓ వైపు ఆక్సిజన్​ దొరకక.. ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకక రోగులు ఇబ్బందులు పడుతుంటే వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఐపీఎల్​ నిర్వహించడం కరెక్టనా అంటూ కొందరు ఐపీఎల్​ క్రీడాకారులే వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు ఐపీఎల్​ నుంచి ఆస్ట్రేలియా క్రికెటర్లు అంతా వచ్చేయాలంటూ ఆ దేశం సూచించింది.

భారత్​ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్​ నుంచి ప్రపంచదేశాలకు రాకపోకలు బంద్​ కావచ్చని ఈ నేపథ్యంలో భారత్​లో ఉండటం అంత సేఫ్​ కాదని పలు దేశాలు భావిస్తున్నాయి. డబ్ల్యూహెచ్​వో సైతం ఇండియాలో ఆందోళన కర పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నది. అయినా కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఎన్నికలు నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలు నిర్వహించి కరోనా సెకండ్​ వేవ్​కు కారణమైన ఈసీ (ఎన్నికల సంఘం) పై మర్డర్​ కేసు పెట్టాలంటూ మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

ఇటువంటి భయానక పరిస్థితుల్లో భారత్​లో టీ20 వరల్డ్​ కప్​ నిర్వహణ అసాధ్యమన్న భావన వ్యక్తమవుతున్నది. మరో 5 నెలల్లో భారత్​లో టీ20 వరల్డ్​ కప్​ జరగాల్సి ఉంది. అయితే అప్పటి వరకు కరోనా తగ్గుతుందా? లేదా? అన్న విషయంపై క్లారిటీ లేదు. మరోవైపు యూఏఈని టీ20 వరల్డ్​కప్​ కోసం స్టాండ్ బై గా ఉంచినట్లు డైలీ మెయిల్​ అనే తెలిపింది. వరల్డ్ కప్ నిర్వహణ కోసం బీసీసీఐ ప్రతిపాదించిన వేదికలను ఐసీసీ పరిశీలన జరుపుతోంది.

దేశంలో నిర్వహించడం అసాధ్యం అని ఐసీసీ నిర్ధారిస్తే వరల్డ్ కప్ యూఏఈకి తరలించక తప్పదు అనే కథనాలు వినిపిస్తున్నాయి. గత ఐపీఎల్​ కూడా కరోనా కారణంగా దుబాయ్​లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా టీ20 వరల్డ్ కప్ అలాగే నిర్వహిస్తారా? ఒక వేళ నిర్వహించినా భారత్​ ఆడుతుందా? లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.