Begin typing your search above and press return to search.

ఇంటింటికీ రేషన్ ఆచరణ సాధ్యమేనా ?

By:  Tupaki Desk   |   13 Dec 2020 8:49 AM GMT
ఇంటింటికీ రేషన్ ఆచరణ సాధ్యమేనా ?
X
అర్హులైన పేదలందరికీ రేషన్ సరుకులు అందించాలనే ప్రభుత్వ కృతనిశ్చయం మెచ్చుకోతగిందే. కానీ ఆచరణలో ఈ పద్దతి ఎంతవరకు సాధ్యమవుతుంది ? అనేది అసలు సమస్య. ఇప్పటివరకు రేషన్ అవసరమైన జనాలు తమకు సంబంధించిన రేషన్ షాపులకు వెళ్ళి సరుకులు తెచ్చుకునేవారు. ఒకరోజు కుదరకపోతే మరోరోజైనా షాపుకెళ్ళి సరుకులు తెచ్చుకునేవారు. కానీ పేదలకు ఇకనుండి రేషన్ దుకాణాల చుట్టు తిరిగే పని తప్పించాలని జగన్మోహన్ రెడ్డి కొత్త ఆలోచన చేశారు.

అయితే ఆలోచన చేసినంతగా ఆచరణ సాధ్యంకాదు అన్నీ పనులు. జనవరి 1వ తేదీనుండి ఇంటింటికి వెళ్ళి రేషన్ దుకాణాలు అందించాలన్న పథకం కూడా ఎంత వరకు సక్సెస్ అవుతుందో అర్ధం కావటంలేదు. ఆచరణలో ఎదురయ్యే అనేక సమస్యలు ఇఫుడు ప్రస్తావనకు వస్తోంది. ఎందుకంటే ఈ పథకాన్ని అమల్లోకి తేవాల్సింది, విజయవంతం చేయాల్సింది గ్రామ వాలంటీర్లే. ఇంటింటికి రేషన్ కార్యక్రమం విజయవంతం అవ్వాలంటే ముందుగా రేషన్ కార్డల మ్యాపింగ్ జరగాలి.

ప్రభుత్వ లెక్కల ప్రకారమే మ్యాపింగ్ అవ్వాల్సిన రేషన్ కార్డులు ఇంకా 30 శాతం మిగిలేఉంది. కార్యక్రమం ఏమో జనవరి 1వ తేదీనుండి అమల్లోకి రావాల్సిందే అని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా ఆదేశించేశారు. దానికి తగ్గట్లు పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఎంత స్పీడుగా ప్రయత్నాలు చేసినా మిగిలిన 30 శాతం మ్యాపింగ్ జరుగుతుందా అన్నది అనుమానమే. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేసినా అసలు సమస్యంతా వాలంటీర్ల దగ్గరే మొదలవుతుంది.

ఎలాగంటే వాలంటీర్లు రేషన్ తీసుకుని కార్డుదారుల ఇళ్ళకు వెళ్ళినపుడు వాళ్ళు ఇంట్లోనే ఉండాలి. పైగా ఇంటికి రేషన్ వచ్చినపుడు తీసుకోవటానికి వాళ్ళదగ్గర డబ్బులుండాలి. సరే పింఛన్ నెల 1వ తేదీనే ఇస్తోంది కాబట్టి సరుకులు తీసుకోవటానికి డబ్బులుంటుందని అనుకుందాం. కానీ రేషన్ తీసుకునేవాళ్ళందరికీ ప్రభుత్వం పింఛన్ ఇవ్వటం లేదుకదా. అసలు కార్డదారులు రేషన్ తీసుకునేందుకు ఇంట్లోనే లేకపోతే అప్పుడు వాలంటర్లేమి చేయాలి ? ఇలా ఇళ్ళల్లో లేని వాళ్ళకోసం ఎన్నిసార్లని తిరగాలి ? ఇప్పటికి అంచనా వేసిన సమస్యలు మాత్రమే ఇవి. రేపు కార్యక్రమం అమలు మొదలైన తర్వాత ఇంకెన్ని సమస్యలు తెరమీదకు వస్తాయో ?