Begin typing your search above and press return to search.
ఆ చెదలు పట్టిన చట్టం మనకెందుకు... సుప్రీం ఫైర్...!
By: Tupaki Desk | 15 July 2021 10:30 AM GMTభారతదేశ ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తోన్న క్రమంలో ఆ పోరాటంలో పాల్గొన్న వారిపై బ్రిటీష్ ప్రభుత్వం తరచూ రాజద్రోహం / దేశద్రోహం నేరం మోపేది. భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ లాంటి ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులపై నాటి బ్రిటీష్ ప్రభుత్వం ఈ చట్టలు ప్రయోగించి వారిని వెంటాడడం లేదా చంపడం చేసింది.
ఇప్పుడు దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు అవుతున్నా కూడా ఇంకా ఈ పదాలను వాడుతుండడంతో పాటు ఇవే చట్టాలను కంటిన్యూ చేస్తున్నాము. దీనిపై సుప్రీంకోర్టు తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది వలసవాదుల కాలం నాటి తుప్పు పట్టిన చట్టమని.. ఇంకా ఈ చట్టం కింద కేసులు నమోదు అవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించింది.
ఈ వలస వాదుల నాటి చట్టం ఇంకా కొనసాగించడం మనకు అవసరమా ? అన్న సుప్రీం గురువారం దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో మనదేశాన్ని పాలించిన బ్రిటీష్ ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధుల పోరాటాన్ని అడ్డుకునేందుకు ఈ కఠిన చట్టాలను ఉపయోగించేదని... గాంధీ లాంటి వాళ్లపై ఈ చట్టం పదే పదే ప్రయోగించేవారని పేర్కొంది.
ఈ క్రమంలోనే బ్రిటీషర్లు ఐపీసీ సెక్షన్ 124-ఎ తీసుకువచ్చారని చెప్పింది. ఇప్పుడు దేశానికి స్వాతంత్య్రం వచ్చింది ? దేశంలో పరిస్థితులు మారాయి ? ఇంకా ఎందుకు ? దీనిని పట్టుకుని వేలాడడం అని తీవ్రంగా గర్హించింది.
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ. రమణ దేశద్రోహ చట్టం అమలు పరిశీలిస్తామని చెపుతూనే దీనిపై కేంద్రం నుంచి వివరణ కోరారు. విశ్రాంత మేజర్ జనరల్ ఎస్‌జీ వోంబాట్కెరె.. ఐపీసీలోని 124-ఎ సెక్షన్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోందని.. హక్కులకు సైతం విఘాతం కలిగిస్తోందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పై వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ రాజద్రోహం / దేశద్రోహంపై ఇప్పటికే అనేక పిటిషన్లు దాఖలు అయినందున వీటిన్నింటిపై ఒకేసారి విచారణ జరగాలని కూడా త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది.