Begin typing your search above and press return to search.
మళ్లీ అలాంటి ఘటనే.. పోలీసుల వైఫల్యమా లేక పార్టీ వైఫల్యమా?
By: Tupaki Desk | 2 Jan 2023 4:26 AM GMTకొద్ది రోజుల క్రితం శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కందుకూరులో టీడీపీ నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇంతలోనే గుంటూరులో మరో తొక్కిసలాట చోటు చేసుకుని ముగ్గురు మరణించిన విషయం విదితమే. ఈ ఘటన మరోమారు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది.
తమ కార్యక్రమాలకు, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న తాను పాల్గొనే సభలకు పోలీసులు తగినంత భద్రత కల్పించడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రజలను నియంత్రించడం కష్టమవుతోందని టీడీపీ నేతలు అంటున్నారు.
మరోవైపు వైసీపీ నేతలు మాత్రం ఇరుకు సందుల్లో సభలు నిర్వహిస్తున్నారని.. దీంతో తొక్కిసలాటలు చోటు చేసుకుని అమాయకులు మరణిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇరుకు సందుల్లో సభలు పెట్టి.. ప్రజలు భారీ ఎత్తున వచ్చారని చెప్పుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబు ప్రచార యావ వల్లే కొత్త సంవత్సరం రోజు ముగ్గురు మరణించారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
వాస్తవానికి గుంటూరులో తాము అన్నగారి జనతా వస్త్రాలు, చంద్రన్న కానుకను అందజేస్తామని.. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగినంత భద్రత కల్పించాలని ముందుగానే పోలీసులను కోరామని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయినా తగిన భద్రత కల్పించలేదని ఆరోపిస్తున్నారు.
గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'ఎన్టీఆర్ జనతా వస్త్రాలు', 'చంద్రన్న కానుక' పేరుతో బహుమతి కార్యక్రమం నిర్వహించడంతో భారీ ఎత్తున మహిళలు తరలివచ్చారు. దాదాపు 30 వేల మంది తరలివచ్చారని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత చీరల పంపిణీ చేపట్టగా ఒక్కసారిగా వాటి కోసం ప్రజలు తోసుకున్నారని.. అక్కడే పెట్టిన బారికేడ్లు విరిగిపోయాయని అంటున్నారు. దీంతోనే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ విమర్శలు ఎలా ఉన్నా మరో ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వీరికి కందుకూరు దుర్ఘటన బాధితులకు ఇచ్చినట్టే రూ.20 లక్షల చొప్పున టీడీపీ ఇచ్చినా, అలాగే జగన్ ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినా పోయిన ప్రాణాలైతే తిరిగిరావు. తమ వారిని కోల్పోయిన మృతుల కుటుంబాల ఆవేదనను అవి తీర్చలేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.