Begin typing your search above and press return to search.
బాబుకు లోకేశ్ డోర్ మూసేయాల్సిన టైం వచ్చేసిందా?
By: Tupaki Desk | 11 Jan 2023 9:32 AM GMTఒకటికొకటిగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో.. ఎట్టి పరిస్థితుల్లో జగన్ కు అధికారాన్ని దూరం చేయాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యం నెరవేరటానికి అట్టే సమయం లేదన్న మాట తెలుగు తమ్ముళ్ల నోట ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తోంది. జగన్ బలాన్ని తక్కువగా అంచనా వేయటం ద్వారా 2019లో షాకింగ్ అనుభవాన్ని ఇప్పటికే చవి చూసిన వారిలో ఇటీవల కాలంలో కాస్తంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం.. జగన్ ప్రభుత్వంపై విపక్షాలకు ఉన్న వ్యతిరేకత సామాన్య ప్రజల్లో ఎంత ఉందన్నది చాలా కీలకమైన అంశం. అదే వచ్చే ఎన్నికల ఫలితాల్లో కీలక భూమిక పోషిస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ను ఒక్కడిగా ఎదుర్కొనే విషయంలో తెలుగుదేశం పార్టీకి అంత బలం లేదన్న నిజాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా తెలుగుదేశాన్ని అభిమానించేవారు.. ఆరాధించేవారు.. బాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకునే శ్రేయోభిలాషులు తమ ఇగోలను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే.. నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోవటం ద్వారానే కొత్త బంధాల్ని మరింత బలోపేతం చేసుకోవచ్చన్న విషయాన్ని మర్చిపోకూడదు.
2019 ఎన్నికల తర్వాత పత్తా లేకుండా పోయిన కొందరు టీడీపీ నేతలు ఇప్పుడు హాటాత్తుగా తెర మీదకు వస్తున్నారు. పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాడి వదిలేసిన వారంతా రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ మార్పుల్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి వారు ఇప్పటివరకు తాము పార్టీకి.. పార్టీ తరఫున చేసింది ఏమీ లేకున్నా.. రానున్న రోజుల్లో ఉండే అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు వీలుగా పావులు కదుపుతున్నారు. అలాంటివారిలో చాలామందిని కలిసేందుకు చంద్రబాబు ససేమిరా అంటున్నట్లుగా తెలుస్తోంది.
తన రాజకీయ జీవితంలో ఎప్పుడు ఎదుర్కోనంత ప్రతికూల పరిస్థితుల్ని.. పరీక్షల్ని.. గడ్డు పరిణామాల్ని ఎదుర్కొన్న వేళలో పత్తా లేకుండా పోయినోళ్లు.. ఇప్పుడు తెర ముందుకు వచ్చేందుకు సిద్ధం కావటంతో ఆయన అలెర్టు అవుతున్నారు. ఇలాంటి వారికి తనను కలిసే అవకాశం ఇవ్వట్లేదు. దీంతో.. వారికి ఇప్పుడు బాబు తర్వాత డోర్ ఉన్న లోకేశ్ కనిపిస్తున్నారు. దీంతో ఆయన్ను ప్రసన్నం చేసుకోవటం షురూ చేశారు.
ఇప్పటివరకు పార్టీ కోసం కించిత్ పని చేయని వారు ఇప్పుడు ఏదో చేస్తామన్నట్లుగా ముందుకు వస్తున్న వారిని లోకేశ్ సైతం కలవకుండా ఉండటమైనా చేయాలి. లేదంటే.. లోకేశ్ ను కలిసినా.. ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయం వారికి అర్థమయ్యేలా చేయాలి. అంతేకాదు.. టీడీపీలో ఉండి.. పార్టీ కోసం పని చేయని నేతల్ని జనసేన సైతం తమ వద్దకు వచ్చేందుకు అవకాశం ఇవ్వకూడదన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందంటున్నారు.
అలా చేయటం ద్వారా ఇద్దరి మధ్య స్నేహం మరింత బలం కావటం ఖాయం. అంతేకాదు.. బాబు కాకుంటే చినబాబు ఉన్నాడన్న భావనకు పుల్ స్టాప్ పెట్టేందుకు వీలుగా లోకేశ్ డోర్ ను కూడా మూసేయాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉందన్నది మర్చిపోకూడదు. ఆ విషయంలో ఆయన ఎంత త్వరగా స్పందిస్తే.. అంతమంచిదని చెప్పక తప్పదు. మరి.. బాబు ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.