Begin typing your search above and press return to search.

గంటా చెప్పింది నిజమా? అబద్ధమా?

By:  Tupaki Desk   |   1 Jun 2019 10:04 AM GMT
గంటా చెప్పింది నిజమా? అబద్ధమా?
X
ఏపీలో గవర్నమెంటు మారినా రాజకీయాలు హాట్ గానే ఉన్నాయి. ఊహించని ఓటమితో తెలుగుదేశం పార్టీ తట్టుకోలేకపోతోంది. కొత్త గవర్నమెంటును ఏమీ అనలేక ... జగన్ ను బ్లేమ్ చేయడానికి ఏదో ఒక ఇష్యూను వెతుకుతోంది. కేంద్రంలో మోదీ రెండో సారి ప్రధాని అయ్యాక ప్రమాణ స్వీకారం చేస్తే ఆ వేడుకకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు హాజరయ్యారు. కానీ, ఏపీలో జగన్ ప్రమాణ స్వీకారానికి టీడీపీ నుంచి ఒక్కరూ హాజరుకాలేదు. పొరుగు రాష్ట్రాల నేతలు వచ్చారు గాని ఏపీ ప్రతిపక్ష పార్టీ నుంచి ఎవరూ రాలేదు. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడానికి చంద్రబాబుకు జగన్ ఫోన్ చేస్తే ఆయన మాట్లాడలేదట. కార్యాలయ సిబ్బంది మాత్రమే మాట్లాడారని వైసీపీ చెబుతోంది. అయితే దీనిపై టీడీపీ వెర్షను ఇంకోలా ఉంది.

టీడీపీ ప్రతినిధి బృందం జగన్‌ను అభినందించేందుకు రెండు రోజులు పాటు ప్రయత్నించినా ఆయన అపాయింటుమెంటు దొరకలేదని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన జగన్ ను అభినందించేందుకు రెండు రోజుల పాటు ప్రయత్నించినా... కలిసే అవకాశం లభించలేదని గంటా ఆరోపించారు. మా నాయకుడి సూచన మేరకు జగన్ ను కలసి శుభాకాంక్షలు తెలిపేందుకు తనతో పాటు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడును పార్టీ పంపిందని చెప్పారు. అయితే, జగన్ మాకు సమయం ఇవ్వలేదన్నారు.

ఇదిలా ఉండగా... జగన్ తన ప్రమాణస్వీకారం సమయంలో చేసిన వ్యాఖ్యలను కూడా గంటా తప్పుపట్టారు. ఆ మాటలు సమంజసం కాదన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన నవరత్నాల హామీ నుంచి తప్పించుకునేందుకు జగన్ యత్నిస్తున్నారని గంటా ఆరోపించారు. ప్రధాని మోదీని కలిసిన తర్వాత ప్రత్యేక హోదాపై జగన్ స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారని... డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారని గంటా అన్నారు. టెండర్లను రద్దు చేస్తామంటూ, గత ప్రభుత్వంపై కక్ష సాధింపులకు దిగేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. గెలుపు, ఓటమిలు టీడీపీకి కొత్త కాదని... తిరిగి ప్రజల మద్దతును పొందుతామని తెలిపారు.

అయితే, గత ప్రభుత్వం తప్పు చేయకపోతే అది కక్ష సాధింపు అవుతుంది. తప్పు చేసి ఉంటే శిక్ష అవుతుంది. ఏదయినా తేలేది విచారణ తర్వాతే. దీనికి టీడీపీ తుడుముకోవడం ఎందుకో మరి. ఇక జగన్ హామీలపై విమర్శించే ముందు ప్రభుత్వానికి కనీసం 6 నెలలు సమయం ఇవ్వాలన్న కనీస విషయాన్ని మరిచిపోయారు గంటా శ్రీనివాసరావు.