Begin typing your search above and press return to search.

విశాఖ వాసులకు షాకిచ్చే ప్లానింగ్ లో జగన్ ఉన్నారా?

By:  Tupaki Desk   |   4 Oct 2022 4:37 AM GMT
విశాఖ వాసులకు షాకిచ్చే ప్లానింగ్ లో జగన్ ఉన్నారా?
X
ఉమ్మడి రాష్ట్రంలో కానీ.. విడిపోయిన తర్వాత కానీ ఉత్తరాంధ్రలో భాగమైన విశాఖపట్నం సమ్ థింగ్ స్పెషల్ అన్నట్లుగా చెప్పక తప్పదు. ఉక్కునగరంగా పేరున్న విశాఖను తలుచుకున్నంతనే అందమైన బీచ్ లు బోలెడన్ని గుర్తుకు రావటమే కాదు.. సముద్ర ఒడ్డున ఉన్న బ్యూటీఫుల్ సిటీ గుర్తుకు వస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో మరే ప్రాంతానికి లేనన్ని స్పెషాలిటీలు విశాఖ సొంతంగా చెబుతారు. దీనికి తోడు ఈ నగరం చాలాకాలం క్రితమే మినీ ఇండియాగా అభివర్ణిస్తారు. అంతేకాదు.. ఈ నగరంలో కనిపించే విలక్షణత మరే నగరంలోనూ ఉండదన్నమాట వినిపిస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా జగన్ ప్రభుత్వం తీసుకున్నట్లుగా చెబుతున్న ఒక వార్తతో విశాఖ మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవటం..దీనిపై కోర్టును ఆశ్రయించటం.. కోర్టు ఆదేశాల నేపథ్యంలో విశాఖకు తరలింపు తాత్కాలికంగా ఆగినా.. త్వరలోనే ఆ దిశగా కసరత్తు పూర్తి చేయాలన్న పట్టుదలతో జగన్ సర్కారు ఉందన్న సంగతి తెలిసిందే.

విశాఖలోని బీచ్ లలో రుషికొండ బీచ్ కు బ్లూఫ్లాగ్ ఉన్న విషయం తెలిసిందే. విశాఖలో బోలెడన్ని బీచ్ లు ఉన్నప్పటికీ రిషికొండ బీచ్ విలక్షణంగా ఉంటుంది. అదే.. ఇప్పుడు విశాఖ వాసులకు వాయింపుగా మారిందని చెబుతున్నారు.

జగన్ ప్రభుత్వం.. ఈ బీచ్ లో ఎంట్రీకి డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన చేయటమే కాదు.. అందుకు తగ్గట్లే బీచ్ నిర్వహణను ప్రైవేటు సంస్థకు అప్పగించినట్లుగా చెబుతున్నారు.

దీంతో.. ఈ అందమైన బీచ్ లోకి అడుగు పెట్టాలంటే డబ్బులు చెల్లిస్తేనే.. లోపలకు ఎంట్రీ అన్నట్లుగా మారనుంది. ఈ నిర్ణయం విశాఖ వాసులకు షాకిచ్చేలా మారుతుందన్న మాట వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.