Begin typing your search above and press return to search.
మౌనంగా ఉండి.. రాజకీయం ఎలా చేయొచ్చో.. జగన్ చూపిస్తున్నారా?
By: Tupaki Desk | 30 Nov 2022 7:51 AM GMTరాజకీయాల్లో రకరకాలు ఉంటాయనే విషయం చాలా కొద్ది మందికే తెలుసు. పంతం పట్టి.. గర్జించి, గాండ్రిం చి .. బ్లాక్‌మెయిల్ చేసే రాజకీయాలు కొన్నయితే.. మౌనంగా ఉండి చేసే రాజకీయాలు కొన్ని ఉంటాయి. గతంలో ప్రధాని మన్మోహన్‌సింగ్.. అనేక విషయాల్లో మౌనంగా ఉండేవారు. ఒకవైపుభారీ ఎత్తున కుంభకోణా లు బయట పడుతున్నా.. ఆయన మాత్రం సైలెంట్‌గా ఉండేవారు. ఇదొక పెద్ద రాజకీయం అనే చర్చ ఆరోజుల్లో సాగేది.
అలానే ఇప్పుడు ఏపీలో కూడా ముఖ్యమంత్రి జగన్.. సైలెంట్‌గా ఉంటూ.. రాజకీయాలను వేడెక్కిస్తున్నా రనే వాదన వినిపిస్తోంది. ఆయన సైలెంట్‌గా ఉండడం కూడా ఒక రాజకీయమే నని అంటున్నారు పరిశీ లకులు. ఎలాగంటే.. ప్రస్తుతం తెలంగాణలో ఆయన సొదరి, వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా జరగని విధంగా ఒక పార్టీ అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలిని.. కూర్చున్న కారులోనే ఎత్తి పట్టుకుని స్టేషన్ తీసుకువెళ్లారు.
ఇక, షర్మిల మాతృమూర్తి విజయమ్మ ధర్నా చేశారు. ఆవేశ పడ్డారు. పోలీసులకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇంత జరుగుతున్నా.. మీడియా దృష్టికానీ.. మేధావుల దృష్టికానీ.. ఏపీవైపు మళ్లుతూనే ఉంది. అక్కడ సీఎం జగన్ ఉన్నారు. షర్మిల అన్న ఉన్నారు. విజయమ్మ కొడుకు ఉన్నారు. ఆయన ఎలా రియాక్ట్ అవుతారు? అనే చర్చ జరుగుతూనే ఉంది. మధ్యలో ఎవరో.. ఇంకేముంది.. జగన్ హైదరాబాద్ వచ్చేస్తున్నారనే పుకారు పుట్టించారు.
ఇలా.. జగన్ ఎపిసోడ్ భారీ ఎత్తున సాగింది. అందరూ అనుకున్నట్టుగా ఆయన ఎక్కడా రియాక్ట్ కాలేదు. కనీసం ..చెల్లెలు అనేసింపతీ కూడా చూపించలేదు. తల్లి అనే ప్రేమను కూడా కురిపించి.. అయ్యో అని కూడా అనలేదు. దీంతో జగన్‌ను కొందరు ఈసడించుకున్నారు. మరీ ఇంత రాజకీయమా? అని మెటికలు విరుచుకున్నారు. కొందరు తిట్టారు. మరికొందరు వాడుకుని వదిలేశారంటూ.. వ్యాఖ్యానించారు.
కానీ, సీఎం జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు.. అనే విషయాన్ని కొంచెం తరచి చూస్తే.. అసలు సిసలు రాజకీయం అంతా అందులోనే కనిపిస్తుంది. తన చెల్లికి, తల్లికి ఆయన చేస్తున్న పొలిటికల్ హెల్ప కళ్లకు కడుతుంది. అదేంటి అంటున్నారు. ఇక్కడే కీలక పరిణామాలు ఉన్నాయి.
+ ఆ కీలక సమయంలో సీఎం జగన్ కనుక ఏపీలో ఏదైనా ప్రకటన చేసి ఉంటే. మీడియా ఫోకస్ అంతా.. ఆయన చుట్టూ తిరిగేది. ఫలితంగా మీడియాలో షర్మిల ఎపిసోడ్ చిన్నదై. కవరేజీ తగ్గిపోయేది
+ ఆ సమయంలో విజయమ్మ గురించి స్పందించి సీఎం జగన్ ఏదైనా కామెంట్లు చేసి ఉంటే.. సేమ్ టు సేమ్.. జరిగి ఉండేది. అంతేకాదు.. అధికార పార్టీ వారు ఖచ్చితంగా జగన్‌కు కౌంటర్ ఇచ్చేవారు. ఇదే జరిగితే.. షర్మిల ఇష్యూ మరింత పలచనై.. ఆయన చేసిన హంగా మా కావొచ్చు.. మరేదైనా కావొచ్చు..లోపలి పేజీలకు వెళ్లిపోయి ఉండేది. అందుకే.. చెల్లికి, తల్లికి మైలేజీ కావాలి.. ఈ ఘటన మైలేజీ తేవాలనే వ్యూహాత్మక రాజకీయం ఇక్కడ ప్లే అయిందని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.