Begin typing your search above and press return to search.
జగన్ అనుమానం నిజమా...?
By: Tupaki Desk | 8 Sep 2022 9:31 AM GMTఏపీలో వైసీపీ గ్రాఫ్ కొంచెం కొంచెంగా పడిపోవడానికి కారణాలు అయితే అధినాయకత్వానికి తెలిసాయని అంటున్నారు. ఆరు నెలల కాలంలోనే చాలా విషయాలు చోటు చేసుకున్నాయని అంటున్నారు. ముఖ్యంగా గడప గడపకు కార్యక్రమం డిజైన్ చేయడం వెనక ఒక్కసారిగా గ్రాఫ్ ని పెంచడమే టార్గెట్ గా ఉంది. కానీ అది ఒక మొక్కుబడి తంతుగా అంతా మార్చేసారు. మొదట్లో సీరియస్ గా గడపలను టచ్ చేసిన వారు సైతం ఇపుడు కాళ్ళు బార్లా జాపేశారు అని నివేదికలు వస్తున్నాయట.
అదే టైం లో ఏపీలో మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రకటనలు కూడా జస్ట్ అలా ఏదో దేనికో అన్నట్లుగా ఉంటున్నాయట. వాటి మీద సీరియస్ డిస్కషన్ కానీ ఎఫెక్ట్ కానీ ఎక్కడా కనిపించడంలేదు అని హై కమాండ్ కి నివేదికలు వెళ్లాయని అంటున్నారు. సరిగ్గా మూడేళ్ల వైసీపీ పాలన నిండిన తరువాత సొంత పార్టీకి చెందిన వారే కొందరు టీడీపీతో మరికొందరు జనసేనతో టచ్ లోకి వెళ్తున్నట్లుగా రిపోర్టులు వస్తున్నాయట.
అదే విధంగా కొందరు వైసీపీ ఎంపీలు పలువురు కూడా బీజేపీ కి టచ్ లోకి వెళ్ళినట్లుగా ప్రచారం సాగుతోంది. సర్వేలు చూసి ఈ విధంగా ఎవరి మటుకు వారు ఫ్యూచర్ ప్లాన్స్ లో ఉన్నారని అంటున్నారు. ఏపీలో వైసీపీ మళ్లీ రావడం డౌట్ అని అంచనాకు వచ్చిన వారు అంతా వేరే పార్టీల వైపు చూస్తున్నారుట. అందుకే చాలా మంది ఎమ్మెల్యేలు విపక్షాల మీద విమర్శలు చేయడం దారుణంగా తగ్గించేశారు.
ఒకనాడు ఒంటికాలు మీద రెచ్చిపోయే వారు కూడా ఇపుడు చప్పున చల్లారిపోయారు. మనకెందుకొచ్చిన గొడవ అని ఆలోచిస్తున్నారు. రేపటి రోజున తమ రాజకీయ బంధాలు దెబ్బతినకుండా లౌక్యంగా వ్యవహరిస్తున్నారు. సరిగ్గా ఈ నివేదికలే ఇపుడు జగన్ ముందు ఉన్నాయని అంటున్నారు.
ఇక ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే మంత్రులు ఎవరూ సరిగ్గా పనిచేయడం లేదు అని అంటున్నారు. చాలా మంది మంత్రులు ఏపీలో ఏమి జరుగుతున్నా కాడే వదిలేసినట్లుగా ఉన్నారు. తమ పనేంటో తామేంటో అన్నట్లుగా ఉన్నారని నివేదికలో పీకే టీం స్పష్టం చేసింది అని అంటున్నారు. టీడీపీ నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టడం లేదు అని కూడా పీకే టీం నివేదిక పేర్కొంటోంది.
దానికి కారణం ఎవరికి వారు తమ సొంత రాజకీయ అజెండాను సెట్ చేసి పెట్టుకున్నారనే అంటున్నారు. ఈ రకమైన నివేదికలు తమ వద్ద ఉండడం వల్లనే జగన్ మంత్రి వర్గ సమావేశంలో మంత్రులకు సీరియస్ గానే క్లాస్ తీసుకున్నారు అని చెబుతున్నారు. విపక్షం మీద గట్టిగా విరుచుకుపడమని ఆదేశాలు జారీ చేయడం వెనక కూడా ఈ నివేదిక ఉందని అంటున్నారు.
మొత్తానికి జగన్ వరకూ చూసుకుంటే మొదటి నుంచే ఆయన నాయకులను నమ్మడంలేదు. ఆయన నేరుగా జనాలతోనే కనెక్షన్ పెట్టుకున్నారు. నగదు బదిలీ పధకాన్ని ఆయన అమలు చేయడం వెనక కూడా ఇదే కారణం అని చెబుతున్నారు. రేపటి రోజున ఈ రకమైన చర్యల వల్ల ఏ నాయకుడు హ్యాండ్ ఇచ్చినా ప్రజలతో టచ్ లో ఉంటే ఎంతో కొంత మేలు జరుగుతుంది అన్న ఉద్దేశ్యంతోనే ఆయన మూడేళ్ళ నుంచి ఇదే బాటన ఉన్నారని అంటున్నారు.
ఏది ఏమైనా ఏణ్ణర్ధంలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఇలా మంత్రులు ఎమ్మెల్యేలు కాడె వదిలేయడం అంటే అధినాయకత్వానికి తీరని బాధగానే వ్యధగానే ఉంటుంది అని అంటున్నారు. దీనికి ప్రతిఫలంగా సీరియస్ యాక్షన్ హై కమాండ్ సైడ్ నుంచి ఉంటుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.