Begin typing your search above and press return to search.

జగన్ టార్గెట్ 25 మంది ఎంఎల్ఏలేనా ?

By:  Tupaki Desk   |   31 Aug 2022 6:29 AM GMT
జగన్ టార్గెట్ 25 మంది ఎంఎల్ఏలేనా ?
X
పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారమైతే ఇలాగే ఉంది. ఇక్కడ టార్గెట్ అంటే వైసీపీలోని 25 మంది ఎంఎల్ఏలతో పాటు ప్రధాన ప్రతిపక్షం బలంగా ఉన్న మరో 25 నియోజకవర్గాలన్నమాట. ముందు సొంతింటిని చక్కదిద్దుకోవడం లో భాగంగానే సెప్టెంబర్ 2వ తేదీ తర్వాత బాగా బలహీనంగా ఉన్న 25 మంది ఎంఎల్ఏలను పిలిపించుకుని మాట్లాడాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారట. రెండోసారి గెలుపు లక్ష్యంతో జగన్ అనేక వ్యూహాలు అమలు చేస్తున్నారు.

ప్రభుత్వపరంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడమే కాకుండా ఇప్పుడిపుడే అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా దృష్టి సారించారు. అయితే ఏ ప్రభుత్వానికైనా కొంతకాలం తర్వాత జనాల్లో వ్యతిరేకతో లేకపోతే అసంతృప్తో సహజం. ఇదే సమయంలో అధికార పార్టీ ఎంఎల్ఏల వైఖరి వల్ల కూడా జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతుంది. తమ వైఖరివల్ల జనాల్లో బాగా వ్యతిరేకత తెచ్చుకున్న ఎంఎల్ఏల సంఖ్య 25 మందున్నట్లు జగన్ భావిస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం.

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వీళ్ళకే టికెట్లిస్తే ఎంతమంది గెలుస్తారనే విషయంలో రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. రిపోర్టుల ప్రకారం వీళ్ళందరినీ మారిస్తేనే మంచిదని ఫీడ్ బ్యాక్ వచ్చిందట. అందుకనే వీళ్ళపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జగన్ డిసైడ్ అయ్యారట.

సెప్టెంబర్ 2వ తేదీ వైఎస్ వర్ధంతి తర్వాత ఈ 25 నియోజకవర్గాలపైన ప్రత్యేక దృష్టిపెట్టబోతున్నట్లు సమాచారం. ఎంఎల్ఏలను పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడబోతున్నారు. బహుశా రాజధాని ప్రాంతంలోని తాడికొండ నియోజకవర్గంలో ఎంఎల్ఏ శ్రీదేవి ఉన్నప్పటికీ అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ను నియమించటం ఇందులో భాగామనే అనుకోవాలి.

శ్రీదేవి లాంటి ఎంఎల్ఏలతో సమావేశమవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో టీడీపీ బలంగా ఉన్న 25 నియోజకవర్గాలపైన కూడా ప్రత్యేక దృష్టిపెట్టారట. తన సర్వే రిపోర్టుల్లో టీడీపీ బలంగా ఉందని వచ్చిన 25 నియోజకవర్గాల్లోని వైసీపీ నేతలను పిలిపించి మాట్లాడబోతున్నారు. టీడీపీ నియోజకవర్గాల్లో గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహాలపైన సదరు నేతలతో చర్చలు జరపబోతున్నారు. మరి ఈ చర్చల ఫలితాలు ఎలాగుంటాయో చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.