Begin typing your search above and press return to search.

సీబీఐ అద్దంలో బీజేపీ ముఖం టార్గెట్ జ‌గ‌న్‌!

By:  Tupaki Desk   |   5 Oct 2019 1:22 PM GMT
సీబీఐ అద్దంలో బీజేపీ ముఖం  టార్గెట్ జ‌గ‌న్‌!
X
రెండు రోజుల కిందట రాష్ట్రంలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైన విష‌యం.. ఏపీ సీఎం జ‌గ‌న్‌పై గ‌త యూపీఏ హ యాంలో న‌మోదైన కేసులకు సంబంధించి సీబీఐ కోర్టుకు జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త హాజ‌రు మిన‌హాయించేందుకు సీబీఐ మోకాల‌డ్డ‌డ‌మే! ప్ర‌స్తుతం జ‌గ‌న్ ఈ కేసుల నుంచి బ‌య‌ట‌పడేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా? లేదా? అనేది ప‌క్క‌న పెడితే.. కోర్టు నుంచి వ్య‌క్తిగ‌త హాజ‌రుకు మాత్రం మిన‌హాయింపు క‌ల్పించాల‌ని, త‌నకు బ‌దులుగా త‌న‌ లాయ‌ర్ ను పంపుతాన‌ని జ‌గ‌న్ కోర్టుకు విన్న‌వించారు. అయ‌తే, దీనిని సీబీఐ తీవ్రంగా వ్య‌తిరేకించ‌డం, వాద‌న‌లు వినిపించడం వంటివి రాష్ట్రంలో చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

ముఖ్యంగా జ‌గ‌న్ సీఎంగా ఉన్నాడు కాబ‌ట్టి.. సాక్షుల‌ను ప్ర‌భావితం చేస్తాడ‌ని, ఆయ‌న‌ను విడిచిపెట్ట‌రాద‌ని ఇలా.. సీబీఐ చేసిన వ్యాఖ్య‌లు కోర్టు ప‌రిశీల‌కుల‌ను సైతం క‌ల‌క‌లానికి గురి చేశాయి. అయితే, వాస్త‌వానికి ఇన్ని రోజుల్లో లేని అనుమానాలు సీబీఐకి ఇప్పుడే ఎలా వ‌చ్చాయి? అనేది కీల‌క సందేహం. నిజానికి గతంలో ఐదేళ్ల‌పాటు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న‌ప్పుడు ఆయ‌న ప్ర‌భావితం చేయ‌లేదు. స‌రే.. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చాడు కాబ‌ట్టి చేస్తాడ‌ని అనుకున్నా.. నాలుగు మాసాలు గ‌డిచిన నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లూ లేని వ్య‌క్తి ఇప్పుడు ఒక్క‌సారిగా ఎలా వివాదాస్ప‌ద మ‌వుతాడు? ఇదీ ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

దీనికి స‌మాధానం ఎక్క‌డ దొరుకుతుందంటే.. సీబీఐ అద్దంలో!! అవును. గ‌డిచిన కొన్నాళ్లుగా సీబీఐని ఈ దేశంలో ఎవ‌రు మేనేజ్ చేస్తున్నారో.. చంద్ర‌బాబు, మ‌మ‌తా బెన‌ర్జీలు గ‌తంలో చేసిన వ్యాఖ్య‌లే నిరూపిస్తున్నాయి. సీబీఐ అద్దంలో బీజేపీ క‌నిపిస్తుండ‌డం వ‌ల్లే.. ఇప్పుడు జ‌గ‌న్ విష‌యంలో ఇంత ప‌ట్టుద‌ల‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేది వాస్త‌వం. మ‌రి బీజేపీకి ఎందుకు జ‌గ‌న్ అంటే అక్క‌సు!! ఇది మ‌రో మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. నిజానికి బీజేపీకి ఆయ‌నంటే.. మ‌క్కువే. కానీ, ఏపీలో అధికారంపై ప్రేమ‌, పార్టీ ఎదుగుద‌ల‌పై ఆశ‌. ఇవే ఇప్పుడు ఇక్క‌డి అధికార ప‌క్షాన్ని డైల్యూట్ చేయాలి.

తాను ఎద‌గాలి. ఇవే ల‌క్ష్యాల‌తో బీజేపీ ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌ పై కేసుల విష‌యంలో నిన్న మోన్న‌టి వ‌రకు ప‌ట్టువిడుపుల‌తో వ్య‌వ‌హ‌రించిన సీబీఐ.. ఇప్పుడు ఒక్క‌సారిగా.. ప‌ట్టు బిగించింది. అంటే.. అధికార పార్టీలో సీఎం అంత‌టి వ్య‌క్తి ప్ర‌తి శుక్ర‌వారం కోర్టుకు వెళ్తే.. ఆటేమేటిక్ గానే ఆయ‌న ఇమేజ్ ప్ర‌మాదంలో ప‌డే ఛాన్స్ ఉంటుంది. దీనిని త‌మ‌కు అనుకూలంగా అటు చంద్ర‌బాబు, ఇటు బీజేపీ కూడా వినియోగించుకుని అధికారంలోకి రావ‌డ‌మో.. బ‌ల‌ప‌డ‌డ‌మో చేయొచ్చు., ఈ కుయుక్తుల కార‌ణంగానే సీబీఐ ఇంత బ‌లంగా వాద‌న‌లు వినిపించింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.