Begin typing your search above and press return to search.
బీజేపీకి ఫ్రాంచైజ్ జనసేననా?
By: Tupaki Desk | 15 March 2022 11:30 AM GMTరాజకీయాల్లో ఉన్నవారికి ఎవరి సత్తా వారికి ఉండాలి. ఎవరి వ్యూహాలు వారికి ఉండాలి. ప్రజలను మెప్పిం చడం.. వారి ఓట్లను కొల్లగొట్టడం.. అనేది వ్యక్తిగత వ్యూహాలపైనే ఆధారపడి ఉంటుంది. కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో జరుగుతున్నది అదే!. చిన్న పార్టీనా.. పెద్దపార్టీనా.. అనే తేడా లేకుండా..దేశంలోని అన్ని పార్టీలకూ.. కొన్ని వ్యూహాలు ఉన్నాయి. అదేసమయంలో కొన్ని సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. వీటిని వారికి వారే రాసుకున్న.. గిరిగీసి నిర్ణయించుకున్న నియమ నిబంధనలు కూడా!
అయితే.. తాజాగా ..ఏపీలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను బట్టి... ఆ పార్టీకి వ్యూహా లు.. సిద్ధాంతాలు.. ప్రజలను మెప్పించే రాజకీయ పరిణామాలు ఉన్నట్టు కనిపించడం లేదని అంటున్నా రు మేధావులు. ఎలాగంటే.. తాజాగా మంగళగిరిలో జరిగిన.. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పార్టీ అధినేత పవన్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారం సంపాయించుకునేలా తాము ముందుకు సాగుతామన్నారు. వైసీపీ కొమ్ములు విరుస్తామన్నారు. వైసీపీ అధికారాన్ని అంతం చేస్తామని చెప్పారు.
దీంతో ఒక్కసారిగా అందరిలోనూ పవన్ హైప్ పెంచారు. ఇంకేముంది.. జనసేన దూకుడును ఎవరూ ఆపలేరు.. నిర్దిష్టమైన వ్యూహంతోనే పవన్ ముందుకు సాగనున్నారు. ఆయనకంటూ.. కొన్ని వ్యూహాలు ఉన్నాయని చెప్పుకొన్నారు.
అయితే.. ఇంతలోనే పవన్ చేసిన వ్యాఖ్య అందరినీ నీరసపడేలా చేసింది. ఎందుకంటే.. "బీజేపీ రోడ్ మ్యాప్ ను చూసి నిర్ణయాలు తీసుకుంటాం!" అని పవన్ వ్యాఖ్యానించడమే! నిజానికి బీజేపీకి పవన్ అవసరమా? లేక పవన్‌కు బీజేపీ అవసరమా? అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం.. బీజేపీకి పవనే అవసరం!
అలాంటప్పుడు.. పవన్ రోడ్ మ్యాప్‌ను బీజేపీ అనుసరించాలి! కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయిపోయింది. పవన్‌కు తనకు సొంత అజెండా లేదనే చెప్పకనే చెప్పేశారు. బీజేపీ రోడ్ మ్యాప్‌ను చూశాకే నిర్ణయం తీసుకుంటానంటే.. బీజేపీ చెబితేనే చేస్తారా? బీజేపీ ఇస్తేనే మాట్లాడతారా? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. అంతేకాదు.. అసెంబ్లీ సీట్ల విషయంలోనూ.. బీజేపీ ఇచ్చినవే తీసుకుంటారా? అనేది ప్రశ్న. తనకంటూ.. ప్రత్యేక కార్యక్రమాలు, రోడ్ మ్యాప్ ఏమీ లేవా? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. బీజేపీకి జనసేన అనుబంధ విభాగమా? అని నిలదీస్తున్నారు.
పవన్ చేసిన వ్యాఖ్యలను బట్టి..ఆయన బీజేపీ కనుసన్నల్లోనే నడవాలని అనుకుంటున్నట్టు స్పష్టమవుతోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఇదే నిజమైతే.. మన తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఉత్తరాదికి చెందిన బీజేపీ పార్టీ పాదాల ముందు పెట్టేసినట్టేనా? మనకంటూ.. ఉన్న పౌరుషాన్ని.. వారి ముందు చేతులు కట్టుకుని నిలబడేలా చేయడానికేనా? అంటున్నారు పరిశీలకులు. ఏదేమైనా.. ఆచి తూచి ఆమాట్లాడాల్సిన పవన్.. తాను బీజేపీ దాసోహమయ్యాయనే రీతిలో వ్యాఖ్యానించడం వల్ల..ప్రయోజనం కన్నా...నష్టమే ఎక్కువని అంటున్నారు పరిశీలకులు.