Begin typing your search above and press return to search.
జనసేనకు ఆయన గుడ్ బై ఖరారు!
By: Tupaki Desk | 10 Aug 2019 6:25 AM GMTసీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ జనసేనను వీడనున్నారు అనే వార్తలు కొన్నాళ్ల నుంచి వస్తున్నవే. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఎలాంటి ఫలితాలను పొందిందో తెలిసిన సంగతే. జనసేన తరఫు నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసిన లక్ష్మినారాయణ కూడా సత్తా చూపించలేకపోయాడు. జనసేన తరఫున ఎవరైనా నెగ్గుతారని అనుకుంటే వారిలో లక్ష్మినారాయణ ఒకరు అవుతారని చాలా మంది అనుకున్నారు.
విశాఖ వంటి ఎంపీ సీట్లో పోటీ చేయడం, మాజీ ఐపీఎస్ గా ఖ్యాతి వంటి కారణాల చేత ఆయన నెగ్గుతారనే అంచనాలు ఉండేవి. అయితే వైఎస్ జగన్ గాలిలో లక్ష్మినారాయణ కూడా కొట్టుకపోయారు.
ఇక ఎన్నికలు అయిపోయాకా లక్ష్మినారాయణ పెద్దగా పొలిటికల్ యాక్టివిటీస్ లో పాల్గొనలేదు. జనసేన మీటింగులకు కూడా ఆయన హాజరు అయ్యింది లేదు. దీంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేస్తారనే అభిప్రాయాలు వినిపిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో అదే జరగబోతోందని సమాచారం.
లక్ష్మినారాయణ జనసేనలో చేరిన ఆయన అనుచరులు రాజీనామా చేయబోతున్నారట. వీరంతా కలిసి భారతీయ జనతా పార్టీలోకి చేరబోతూ ఉన్నారని సమాచారం. లక్ష్మినారాయణకు మొదట్లోనే భారతీయ జనతా పార్టీ వెల్కమ్ చెప్పిందని అంటారు.
అయితే అప్పట్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాని అనుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే టీడీపీలో చేరితే జగన్ పై నమోదైన కేసుల్లో ఆయన సాగించిన విచారణ అంతా డొల్లఅవుతుందనే లెక్కలతో జనసేనలోకి చేరారంటారు. అయితే జనసేన తరఫున లక్ష్మినారాయణ నెగ్గుకురాలేకపోయారు. ఆ పార్టీ భవితవ్యం కూడా అగమ్యగోచరంగా ఉంది. ఈ పరిణామాల్లో అక్కడ నుంచి లక్ష్మినారాయణ కూడా జంప్ అవుతున్నట్టున్నారు!