Begin typing your search above and press return to search.

అమెరికా అధ్యక్షబరిలో భారతీయురాలు?

By:  Tupaki Desk   |   13 Aug 2018 6:49 AM GMT
అమెరికా అధ్యక్షబరిలో భారతీయురాలు?
X
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవి అంటే మమూలు విషయం కాదు.. ప్రపంచాన్నే శాసించగల అత్యున్నత పదవి. అంతటి పదవి కోసం తీవ్ర పోటీ ఉంటుంది. వచ్చే 2020 ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు ఎవరు అవుతారనే చర్చ తాజాగా ఆ దేశంలో ఊపందుకుంది. కొందరు ఇప్పటికే తమ అభ్యర్థిత్వాలపై సోషల్ మీడియా ద్వారా క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తున్నారు.

వచ్చేసారి అమెరికా అధ్యక్షబరిలో ఎవరనే విషయంలో ఆశ్చర్యకర పరిణామం చోటుచేసుకుంది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్ పేరు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ భారతీయ అమెరికన్ కమలా ఎవరు? ఇప్పుడు ఏం చేస్తున్నారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

కమలా హ్యారిస్ ప్రస్తుతం క్యాలీఫోర్నియా సెనేటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాలిఫోర్నియా అటార్న్ జనరల్ పదవిని కూడా నిర్వహించారు. గడిచిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడిన హిల్లరీ క్లింటన్ కు రాజకీయ సలహాదారుగా ఉన్నారు. కమల సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ విధానాలు, నియామకాలు, దుబారా ఖర్చుపై నిలదీస్తూ ఫేమస్ అయ్యారు..

ఇటీవల డెమెక్రాటిక్ పార్టీ నేతలు, ఓటర్లపై టెలీఫోన్ సర్వే నిర్వహించగా దాదాపు 70శాతం మంది వచ్చేఎన్నికల్లో కమలానే అధ్యక్ష బరిలో నిలవాలని చెప్పడం విశేషం. ప్రఖ్యాత వాషింగ్టన్ పోస్టు కూడా కమలా డెమొక్రట్స్ తరఫున అత్యుత్తమ అభ్యర్థిని అభిప్రాయపడింది.

కమల తల్లి శ్యామలా తమిళనాడుకు చెందిన వారు. బెస్ట్ క్యాన్సర్ పరిశోధకురాలైన ఈమె 1960లో అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. కమల తండ్రి పేరు డొనాల్డ్ హ్యారిస్. ఈయన ఆఫ్రికా సంతతికి చెందిన వారు.. 1964లో కమల జన్మించారు. కమల తాత పీవీ గోపాలన్ దౌత్యవేత్తగా చెన్నైలోని బీసెంట్ నగర్ లో ఉన్నప్పుడు కమల సెలవుల్లో తరచుగా చెన్నైకి వచ్చింది. ప్రస్తుతం కమలా వచ్చే సారి అమెరికా అధ్యక్ష బరిలో నిలుస్తుందనే వార్త తెలియడంతో ఎన్నారైలు - భారతీయులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.