Begin typing your search above and press return to search.

క‌న్నా సార్ క‌మ‌లానికి క‌ట్ చెప్ప‌డం ఖాయ‌మే!

By:  Tupaki Desk   |   17 Jan 2023 5:55 AM GMT
క‌న్నా సార్ క‌మ‌లానికి క‌ట్ చెప్ప‌డం ఖాయ‌మే!
X
ఏపీ బీజేపీలో కీల‌క నాయ‌కుడిగా ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఆ పార్టీకి క‌ట్ చెబుతార‌నే వాద‌న కొన్నాళ్లుగా వినిపిస్తోంది. అయితే.. ఆయ‌న నేరుగా ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజుతో వైరం ఉన్న నేప‌థ్యంలో త‌ర‌చుగా ఆయ‌న విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు. క‌నీసం.. ఎవ‌రికీ ప్రాధాన్యం లేకుండా పోతోంద‌ని.. తాము పార్టీలో ఉన్నామ‌ని అనుకుంటున్నారో లేదో .. కూడా తెలియ‌డం లేద‌ని క‌న్నా వ్యాఖ్యానిస్తున్నారు.

మ‌రోవైపు, ఆయ‌న జ‌న‌సేన‌కు చేరువ అవుతున్నారు. రాష్ట్రంలో జ‌న‌సేన అవ‌స‌రం ఎంతో ఉంద‌ని, ఆ పార్టీ అధినేత‌ ప‌వ‌న్‌కు తాను అండ‌గా నిలుస్తాన‌ని క‌న్నా కొన్ని రోజుల కింద‌ట ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలోనే క‌న్నా పార్టీ మారుతున్నారంటూ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. దీనిపై క‌న్నా ఎలాంటి కామెంట్లూ చేయ‌లేదు. అంటే.. ఆయ‌న బీజేపీలోనే ఉంటున్నార‌ని ఆ పార్టీ నాయ‌కులు సెల్ఫ్ స‌ర్టిఫికెట్లు ఇచ్చేసుకున్నారు. అయితే, ఇంత‌లోనే బీజేపీ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి.

సోమ‌వారం, మంగ‌ళ‌వారం కూడా ఈ స‌భ‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌భ‌ల‌కు ప్ర‌త్యేకంగా కాపు సామాజికవ‌ర్గానికి చెందిన నాయ‌కుల‌కు బీజేపీ ఆహ్వానం పంపింది. వీరిలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ముఖ్యంగా క‌నిపిస్తున్నారు. ఇక‌, సోము వీర్రాజు కూడా.. పార్టీ చీఫ్ గా ఈ స‌భ‌కు హాజ‌ర‌య్యారు.

అయితే, క‌న్నా వ‌స్తార‌నిఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసిన రాష్ట్ర నాయ‌క‌త్వం చివ‌రికి డుమ్మా కొట్ట‌డంతో దానిని అలానే ఉంచేశారు. అంతేకాదు.. బీజేపీ విస్తృత స్థాయి స‌మావేశంలో క‌న్నాపై ఫిర్యాదులు కూడా వెళ్లాయ‌ని స‌మాచారం.

ఈ సంద‌ర్భంగా తాము క‌న్నాకు ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని.. ఆయ‌న కోసం ఫ్లైట్ టికెట్‌ను కూడా బుక్ చేశా మ‌ని.. కానీ, క‌న్నా మాత్రం దీనికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించారని సోము వీర్రాజు నెపం నెట్టే ప్ర‌య‌త్నం చేశారు. మ‌రోవైపు, కీల‌క నేత‌లు జేపీ న‌డ్డా వంటివారు కూడా క‌న్నా ఎందుకు రాలేద‌ని ప్ర‌శ్నించారు.

ఈ ప‌రిణామాల‌తో క‌న్నా వివ‌ర‌ణ లేఖ పంపారు. తాను కుటుంబ కార్య‌క్ర‌మంలో ఉన్నాను అందుకే రాలేక పోయాన‌ని ఆలేఖ‌లో వివ‌రించారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న మాత్రం జ‌న‌సేన‌లో క‌ర్చీఫ్ వేసుకున్నార‌ని అందుకే రావ‌డం లేద‌ని ఓ వ‌ర్గం తేల్చి చెప్పింది. మ‌రి బీజేపీ ఏం చేస్తుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.