Begin typing your search above and press return to search.
కేసీఆర్... బీజేపీకి మేలు చేస్తున్నారా?
By: Tupaki Desk | 15 Jun 2022 7:40 AM GMTకేంద్రంలోని బీజేపీ ఓడగొడతాను. ఎట్టి పరిస్థితిలోనూ నరేంద్ర మోడీని గద్దె దింపుతాను. జాతీయస్థాయిలో నినాదం చేస్తాను.. ప్రజలను బయటకు రప్పిస్తాను.. పార్టీలను నాతో నడిపిస్తాను.. అంటూ. గంభీర వచనాలు పలికిన.. తెలంగాణముఖ్యమంత్రి కేసీఆర్.. తదనంతరం వేస్తున్న అడుగులపై రాజకీయ నేతలు.. విశ్లేష కులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారుపై పోరాడాలంటే.. ఏ ప్రాంతీయ పార్టీకైనా.. దన్నుగా .. కాంగ్రెస్ నిలవాల్సిన అవసరం ఉంది.
ఈ విషయాన్ని అన్ని ప్రాంతీయ పార్టీలు చెప్పేవే. అందుకే కాంగ్రెస్‌తో చిన్న చిన్న విభేదాలు... వివాదా లు ఉన్నప్పటికీ.. కేంద్రంపై పోరాడాలన్న కృత నిశ్చయంతో కాంగ్రెస్‌తో చేతులు కలిపి ముందుకు సాగుతు న్నాయి.
అయితే..కేసీఆర్ విషయానికి వస్తే.. మాత్రం ఆయన పైకి ఒక రకంగా.. వ్యవహరిస్తే.. అంతర్గతంగా మరో రకంగా ఆలోచిస్తున్నారనే వాదన రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికకు సంబంధించి.. పెద్ద ఎత్తున బీజేపీయేతర పక్షాలు.. సమాలోచనలు జరుపుతున్నాయి.
కాంగ్రెస్ వినా.. ఒంటరిగా.. ఈ పార్టీలు ముందుకు సాగే పరిస్థితి లేదు. అందుకే.. బీజేపీని ఎదిరించా లన్నా... మోడీకి సరైన విధంగా పాఠం చెప్పాలన్నా.. కలిసి కట్టుగా సాగాలనే దాదాపు నిర్ణయానికి వచ్చాయి.
కానీ, కేసీఆర్ మాత్రం ఈ వ్యూహంలో ఎక్కడో వెనకడుగు వేస్తున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేది లేదని చెబుతున్నారు. పోనీ.. అలాగని.. ఆయన ఇతర అన్ని పక్షాలను కూడగట్టే ప్రయత్నం చేసినా.. అది కూడా ఒక అడుగు ముందుకు మరో అడుగు వెనక్కి అన్నట్టుగా సాగుతోందని మేధావులు అంటున్నారు.
ఇక, ఇప్పుడు తాజాగా ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఇవాళ ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కారాదని.. కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ తరఫున కూడా ఎవరినీ పంపరాదని నిశ్చయించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ను ఆహ్వానించవద్దని మమతను కోరినా, ఫలితం లేకపోవడంతో ఆయన అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆదిలోనే బీజేపీ వ్యతిరేక కూటమికి పెద్ద అవరోధం ఏర్పడినట్టుగా ఉందని.. కేసీఆర్ నిర్ణయంతో.. బీజేపీ లబ్ధి పొందడమే మిగిలిందని.. అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.