Begin typing your search above and press return to search.

గెలుపు కోసం వైఎస్ జగన్ ను ఫాలో అవుతున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   5 Sept 2022 12:08 PM IST
గెలుపు కోసం వైఎస్ జగన్ ను ఫాలో అవుతున్న కేసీఆర్
X
రాజకీయాల్లో అపర చాణక్యుడు కేసీఆర్. రాజకీయ దురంధరుడిగా పేరుగాంచాడు. కేసీఆర్ స్కెచ్ గీస్తే ప్రత్యర్థులు ఖల్లాసే అంటారు. రాజకీయంగా అడ్డంకులను సులువుగా పరిష్కరించుకుంటారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఇరికించి ఏపీ పంపించిన తీరు.. నయీం ఎన్ కౌంటర్, దిశ ఎన్ కౌంటర్ ఇలా.. రాళ్లేసిన వారితోనే పూలు చల్లించుకున్న ఘనతలు కేసీఆర్ కు ఎన్నో ఉన్నాయి. కానీ రెండు దఫాల పాలన తర్వాత వచ్చిన వ్యతిరేకతను కంట్రోల్ చేయడంలో కేసీఆర్ విఫలమవుతున్నారు.

రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు కేసీఆర్... అస్సలు అనుభవం లేని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఫాలో కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.  యువకుడు అయిన జగన్ వ్యూహాలే ఇప్పుడు కేసీఆర్ కు దిక్కవుతున్నాయి.

తెలంగాణలో  కేసీఆర్ సమర్థమైన పాలన అందించడంలో, ప్రజల హృదయాలకు చేరువ కావడంలో జగన్ మోహన్ రెడ్డి బాటలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. పాత రాజకీయాల జోలికి పోకుండా జగన్ కొత్త ఐడియాలను కేసీఆర్ గ్రహించారు. రేషన్‌ను ఇంటింటికి నేరుగా పంపడం, వృద్ధులకు వారి ఇంటి వద్దకే పింఛను అందజేయడం వంటి కార్యక్రమాలను ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి తీసుకోవాలని.. జగన్ లో ప్రజలకు దగ్గరవ్వాలంటే ఈ రెండు మంచి పథకాలు అని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.

మొదట్లో జగన్ మోహన్ రెడ్డి దీన్ని అమలు చేసినప్పుడు విపక్షాలు జోకులు పేల్చి మరీ ట్రోల్ చేశాయి. కానీ చివరకు అది రాజకీయంగానూ, పాలనాపరంగానూ ఉత్తమమైన సంస్కరణ అని నిరూపించబడింది. ఇంటికే వచ్చి పింఛన్, రేషన్ అందిస్తుండడంతో ప్రజలంతా జగన్ ను కొలుస్తూ ఓట్ల వర్షం కురిపిస్తున్నారు. చెక్కుచెదరని ఓటు బ్యాంక్ జగన్ సొంతం అవుతోంది. ఈ  అంశాలు వచ్చే ఎన్నికల్లో జగన్ కు గొప్ప ఉపకరిస్తాయని అంటున్నారు.

జగన్ బాటను ఫాలో అవ్వాలని డిసైడ్ అయిన కేసీఆర్   తన ఎమ్మెల్యేలను ఇంటింటికీ వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేలా ప్రోత్సహిస్తున్నారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఇది అత్యుత్తమ సంస్కరణ ఏంటంటే వలంటీర్ల వ్యవస్థ.. ఆంధ్రప్రదేశ్‌లోని విలేజ్ వాలంటీర్ల తరహాలో తెలంగాణలో కూడా కేసీఆర్ ఈ వ్యవస్థను ప్రారంభించే అవకాశం ఉందని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. వలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందుతుండడంతో దీన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.