Begin typing your search above and press return to search.
బీయారెస్ కోసం తెలంగాణా కూలీలను పక్కన పెట్టబోతున్న కేసీయార్...?
By: Tupaki Desk | 14 Dec 2022 10:52 AM GMTటీయారెస్ కాస్తా బీయారెస్ అయింది. కేసీయార్ రాజకీయ క్షేత్రం హైదరాబాద్ నుంచి హస్తినకు మారింది. టీయారెస్ అంటే ఒక ఉప ప్రాంతీయ పార్టీ. అది తెలంగాణా పునాదుల మీద ఏర్పడింది. తెలంగాణా ఉద్యమం. దాని నామస్మరణ చేస్తూ కేసీయార్ టీయారెస్ ని రాజకీయ పార్టీగా మార్చేశారు. తెలంగాణా ఊపిరిగా ఆయన ఇన్నేళ్ల రాజకీయం సాగింది. ఎవరైనా ఇతర పార్టీలు పోటీకి వస్తే వారి మూలాలను వెలికి తీసి జై తెలంగాణా అనిపించేవరకూ టీయారెస్ నేతలు ఊరుకునేవారు కాదు.
అలా టీయారెస్ కి ప్రాణంగా తెలంగాణా ఉండేది. అలా కేసీయార్ కి అవసరం అయినప్పుడల్లా తెలంగాణా సెగని రగిలిచించడానికి చాలా మంది ఉండేవారు. దాంతో ఎలాంటి రాజకీయాన్ని అయినా సరే కేసీయార్ తెలంగాణాను తెచ్చి మరీ ఢీ కొట్టేవారు. పై చేయి సాధించేవారు. ఇలా కేసీయార్ తెలంగాణా ఆయుధాన్ని మోసే కూలీలు చాలా మంది కనిపించేవారు. అలా వారిని ఇష్టం వచ్చినట్లుగా వాడేసుకుని కేసీయార్ రచ్చ రచ్చ చేసేవారు.
కానీ ఇపుడు బీయారెస్ ఏర్పడింది. తెలంగాణా నినాదంతో ఇపుడు పని లేదు. పైగా భారతదేశం అంతా తిరగాలి. జాతీయ పార్టీగా నిలవాలి అంటే జాతీయ వాదంతో ముందుకు రావాలి. అందువల్ల సంకుచితమైన తెలంగాణా వాదాన్ని పట్టుకుని కూర్చూంటే వర్కౌట్ కాదు సరికదా అది బూమరాంగ్ అవుతుంది. జాతీయ పార్టీ నేత ఉప ప్రాంతీయ వాదం అంటూ ప్రత్యర్ధులు దుమ్మెత్తి పోస్తారు. దాంతో తాను ఎగదోసిన తెలంగాణా వాదానికి కేసీయార్ స్వస్తివాచకం పలకబోతున్నారు అని అంటున్నారు.
మరి బీయారెస్ కి కూడా మనుషులు కావాలి కదా. బీయారెస్ ని ప్రమోట్ చేయాలి కదా. అలా కనుక చూసుకుంటే ఇపుడు ఇతర రాష్ట్రాల వారితోనే కేసీయార్ కి పని ఎక్కువ పడుతోంది. హైదరాబాద్ తో దాదాపుగా కోటి దాకా జనాభా ఉంది. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, ఉపాధి, వ్యాపారం, విద్య వంటి వాటి కోసం వచ్చిన వారు అత్యధిక సంఖ్యలో ఉంటారు. వారిని చేరదీయడానికి కేసీయార్ సరికొత్త ప్లాన్ వేస్తున్నారు అని అంటున్నారు
వారే బీయారెస్ కి బ్రాండ్ అంబాసిడర్లుగా కేసీయార్ భావిస్తున్నారు అంటున్నారు. ఇతర రాష్ట్రాల వారికి ఇపుడు కేసీయార్ పెద్ద పీట వేయబోతున్నారని, వారిని అన్ని విధాలుగా మంచిగా చూసుకుంటూ వారి చేతనే కేసీయార్ సాబ్ గొప్పవారు అనిపిస్తూ వారిని ముందుంచుకుని ఆయా రాష్ట్రాలలో బీయారెస్ జెండా పాతాలని కేసీయార్ చాణక్య రాజనీతిని ఉపయోగిస్తారు అని అంటున్నారు. అంటే హైదరాబాద్ లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సెటిలర్స్ తోనే కేసీయార్ కి పెద్ద పని పడింది అని అంటున్నారు.
సో ఆ విధంగా సెటిలర్లకు మంచి డిమాండ్ ఏర్పడగా అదే టైం లో తెలంగాణా వాదం అంటూ అగ్గి రగిల్చే వారంతా ఇక తెర వెనకకు వెళ్లక తప్పదని అంటున్నారు. వారు పక్కన ఉంటే తప్పు కూడా. అందుకే తెలివిగా చాలా కన్వీనియెంట్ గా తప్పించేసి ఇపుడు ఇతర రాష్ట్రాల సెటిలర్లకు పెద్ద పీట వేయడానికి కేసీయార్ చూస్తున్నారు అని అంటున్నారు. ఇలా కేసీయార్ టీం లోకి వచ్చే వారిలో సినిమా యాక్టర్లు ఉంటారు, అలాగే వివిధ రంగాల ప్రముఖులు ఉంటారు, పెద్దలు మేధావులు ఉంటారు అని అంటున్నారు. వీరంతా బీయారెస్ టీం అన్న మాట.
ఈ టీం తోనే రేపటి తన జాతీయ రాజకీయాన్ని కేసీయార్ నడిపించబోతున్నారు. మరి నా తెలంగాణా బంగారు తెలంగాణా కోటి మాగాణి సీమ అని గొంతెత్తి అరచిన వారి సంగతేంటి అంటే వారు పూర్తిగా తెర మరుగే అని అంటున్నారు. రాజకీయం అంటే ఇదే. కేసీయార్ టీయారెస్ ని పేరు మారుస్తారు అని ఎవరైనా అనుకున్నారా ఆయన ఆ పనిచేశారు కాబట్టి తెలంగాణా అంటూ గొంతు చించుకున్న వారు కూడా ఇపుడు అవసరం లేదంతే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.