Begin typing your search above and press return to search.
కేసీఆర్ మరో సంచలనానికి తెరతీశాడా?
By: Tupaki Desk | 9 Sep 2022 7:33 AM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులు జాతీయ స్తాయిలో పడబోతున్నాయి. ఆయన జాతీయ పార్టీ ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో రెండు సార్లు సీఎంగా చేసిన కేసీఆర్ తన పాలన, అభివృద్ధితో ఆకట్టుకున్నారు. ముచ్చటగా మూడోసారి గెలుపు సాధించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత రాష్ట్రసమితికి పురుడుపోయబోతున్నట్టు తెలుస్తోంది.
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రకటన తెలియని కారణాలతో ఆలస్యం అవుతూనే ఉంది. తాజా రాజకీయ పరిణామాల ప్రకారం.. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన జాతీయ రాజకీయ పార్టీ ప్రారంభానికి అన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
పార్టీ ప్రకటన హైదరాబాద్‌లో జరగనుంది. పార్టీ ప్రకటన తర్వాతే పొత్తులు, ఫ్రంట్‌లు ఖరారు కానున్నాయి. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఈ నెల 11న హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌ను కలవనున్నారు. ఆరోజే పార్టీ ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ముమ్మరంగా అడుగులు వేస్తున్నట్లు తాజా సంకేతాలను బట్టి స్పష్టమవుతోంది.
జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టి క్రియాశీలక పాత్ర పోషించాలని కేసీఆర్ పెద్ద కలలు కంటున్నాడు. ఇటీవల నిజామాబాద్ బహిరంగ సభలో 2024లో ఢిల్లీలో బీజేపీయేతర ప్రభుత్వం రాబోతోందని, రైతులకు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు.
కాబట్టి బీఆర్ఎస్ ప్రకటనకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.ఇదే జరిగితే దేశవ్యాప్తంగా బీజేపీ, టీఆర్ఎస్ తర్వాత మరో జాతీయ పార్టీ మూడో ప్రత్యామ్మాయంగా పుట్టబోతున్నట్టు అర్థమవుతోంది.
దేశంలో ఇప్పుడు బీజేపీకి ఎదురులేదు. మోడీని ఎదురించే నేతలెవరు లేరు. ఎదురించిన వారిని ఎలా దారికి తెచ్చుకోవాలో బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. ఈ మధ్య జాతీయ స్థాయిలో కొత్త పార్టీ అంటూ.. బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా జాతీయ నేతగా ఎదిగేందుకు కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్న సంగతి తెలిసిందే. అందుకే తెలంగాణపై దండయాత్రకు బీజేపీ పెద్దలు కేసీఆర్ ను ఎదగనీయకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేయడానికి ప్రధానంగా ఇదీ ఒక కారణంగా చెప్పొచ్చు..
ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ అనూహ్యంగా దేశ ప్రధాని అయ్యారు. గుజరాత్ విజన్ ను దృష్టిలో పెట్టుకొని పాపులారిటీతో ప్రధాని రేసులో నిలిచారు. రెండు సార్లు పీఎం సీటును అధిరోహించారు. ఇప్పుడే అదే ఫార్ములాను తెలంగాణను అభివృద్ధిపథంలో నిలిపిన కేసీఆర్ అనుసరిస్తున్నారు. జాతీయ నేతగా మారేందుకు.. ప్రధాని పదవికి పోటీదారుగా కేసీఆర్ వస్తున్నారు. మోడీతో సమానమైన మాటల దాడి.. పరిణతి.. రాజకీయాల్లో చక్రం తిప్పగల నేర్పు కేసీఆర్ సొంతం. అందుకే ఆదిలోనే కేసీఆర్ ను తొక్కేసి తెలంగాణకే పరిమితం చేసేలా బీజేపీ స్కెచ్ గీస్తోంది. వాటిని తట్టుకొని కేసీఆర్ జాతీయ స్తాయిలో ఎంతమేరకు నిలబడుతాడన్నది వేచిచూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.