Begin typing your search above and press return to search.
కాంగ్రెస్‌ను చూసి కేసీఆర్ భయపడుతున్నారా?
By: Tupaki Desk | 15 Jun 2022 3:30 PM GMTజాతీయ రాజకీయాల్లో దుమ్ము రేపాలని భావిస్తున్న కేసీఆర్.. కాంగ్రెస్‌తో కలిసి పయనించేందుకు జంకుతు న్నారా? ఆ పార్టీతో జట్టుకట్టి జాతీయ రాజకీయాలు చేస్తే.. రాష్ట్రంలో బ్యాడ్ సంకేతాలు వెళ్తాయని ఆయన అనుకుంటున్నారా? అంటే.. ఔననే అంటున్నారు మేధావులు. ప్రస్తుతం బీజేపీపై వ్యతిరేకత ప్రదర్శిస్తున్న కేసీఆర్.. ఇంటా బయటా కూడా.. బీజేపీని తిట్టిపోస్తున్నారు. ఇక, బీజేపీకి వ్యతిరేకంగానే.. దేశంలోని ప్రాంతీయ పార్టీలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే..కొన్ని ప్రాంతీయ పార్టీలు... మాత్రం కాంగ్రెస్‌లేని.. తృతీయ కూటమి అసాధ్యమని స్పష్టం చేస్తు న్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడులోని అధికార డీఎంకే, బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, జార్ఖండ్‌లో ని జేఎంఎం వంటి పార్టీలు ఇదే అభిప్రాయంతో ఉన్నాయి.
అందుకే.. ప్రాంతీయంగా కాంగ్రెస్‌ను వ్యతిరే కిస్తున్నా.. జాతీయ రాజకీయాల్లో మాత్రం కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగాలనే నిర్ణయంతో ఉన్నాయి. అయితే.. ఇదే పనిచేస్తే.. తెలంగాణలో తనకున్న ఇమేజ్ దెబ్బతింటుందని.. కేసీఆర్ భావిస్తునట్టు స్పష్టంగా తెలుస్తోంది.
ఎందుకంటే.. తెలంగాణలో కాంగ్రెస్ జోరుగా ఉంది. రేవంత్‌రెడ్డి సారథ్యంలో.. కాంగ్రెస్ ఉత్సాహంగా అడు గులు వేస్తోంది. ఈ క్రమంలో ఇక్కడ కాంగ్రెస్‌ను కట్టడి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. పైగా.. కాంగ్రెస్ నేతలు తనపాలనపైనా.. తన పైనా చేస్తున్న విమర్శలు కూడా దారుణంగా ఉంటున్నాయి.
ఈ సమయం లో కాంగ్రెస్‌ను కట్టడి చేయడం.. అత్యంత అవసరం. ఇలాంటప్పుడు.. రాష్ట్రంలో విభేదిస్తూ.. జాతీయస్థా యిలో కలిసి ముందుకు సాగడం.. కష్టమనే భావనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.
దీనివల్లే ఆయన కాంగ్రెస్‌ను విభేదిస్తున్నారు. కానీ, నిజానికి జాతీయ స్థాయిలో పొత్తులు పెట్టుకున్న పార్టీ లు లేదా.. జాతీయ కూటమిగా ఏర్పడిన పార్టీలు.. ప్రాంతీయ స్థాయిలో బలంగానే ఉంటాయి. అయినప్ప టికీ.. పొత్తులతో ముందుకు సాగుతుంటాయి. ఎక్కడి రాజకీయాలు అక్కడే.. అన్నట్టుగా వ్యవహరిస్తుంటా యి. లేక పోతే.. ప్రాంతీయ పార్టీలు జోరును కొనసాగించే అవకాశం ఉండదు. మరి ఈ చిన్న లాజిక్ మిస్సయితే.. కేసీఆర్ అడుగులు ఎలా వేస్తారా? అనేది ప్రశ్న. కాంగ్రెస్ లేకుండా.. ఆపార్టీని కలుపుకొని పోకుండా.. మోడీని ఢీకొట్టడం కష్టమని చెబుతున్న నేపథ్యంలో కేసీఆర్ రాజీ పడతారో.. మొండిగా వ్యవహరిస్తారో చూడాలి.