Begin typing your search above and press return to search.
ఏపీలో కేసీయార్ టీడీపీని టార్గెట్ చేస్తున్నారా ?
By: Tupaki Desk | 4 Oct 2022 5:33 AM GMTవినటానికి ఇది కాస్త అనుమానంగానే ఉన్నా ఇదే నిజమట. టీఆర్ఎస్ ను జాతీయపార్టీగా కేసీయార్ మార్చబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రాంతీయపార్టీగా ఉన్న టీఆర్ఎస్ జాతీయపార్టీగా మారితే ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీచేస్తుంది. కేంద్ర ఎన్నికల కమీషన్లో జాతీయపార్టీగా రిజిస్టర్ చేయటం వేరు రికగ్నిషన్ తెచ్చుకోవటం వేరు. తమ దగ్గర రిజస్టర్ చేసుకున్న ఏపార్టీకైనా కమీషన్ రిజస్టర్డ్ నెంబర్ ఇచ్చేస్తుంది. కానీ రికగ్నిషన్ రావాలంటే మాత్రం కచ్చితమైన నిబంధనలను ఫాలో అవ్వాల్సిందే.
రికగ్నిషన్ రావాలంటే నాలుగు రాష్ట్రాల్లో ఓట్లు, సీట్ల లెక్కలు బోలెడున్నాయి. సో వాటిన్నింటినీ పాటించాలంటే కొన్ని రాష్ట్రాల్లో పోటీచేయాల్సిందే. మరి ఇతర రాష్ట్రాల్లో పోటీచేస్తున్నపుడు సాటి తెలుగురాష్ట్రమైన ఏపీలో పోటీచేయకపోతే కేసీయార్ పరువుపోతుంది.
అందుకనే తనతో కలిసి పనిచేసిన పాతకాపులకు కేసీయార్ ఫోన్లు చేస్తున్నారట. తమ పార్టీలో చేరమని అందరం కలిసి పనిచేసుకుందామని కేసీయార్ పేరుపేరునా అడుగుతున్నారట.
శ్రీకాకుళం, విజయనగరం, కడప, విజయవాడ జిల్లాల్లోని టీడీపీ సీనియర్ నేతలపై కేసీయార్ దృష్టిపెట్టినట్లు సమాచారం. విజయనగరం, శ్రీకాకుళంతో పాటు విశాఖపట్నం జిల్లాల్లో వెలమ, కొప్పుల వెలమ సామాజికవర్గం నేతలున్నారు. వాళ్ళందరితో పాటు తనకు వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉన్న నేతలతో మాట్లాడుతున్నారట.
గతంలో కేసీయార్ తిరుపతి, వైజాగ్ లో పర్యటించినపుడు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. కాబట్టి తనంటే ఏపీలోని కొన్నిప్రాంతాల్లో క్రేజుందని కేసీయార్ అనుకుంటున్నారట.
మరి కేసీయార్ ఎంతమందికి ఫోన్లుచేసింది, వారిలో ఎవరెలా స్పందించారన్న విషయంలో సరైన క్లారిటిలేదు. కాకపోతే ఏపీలో కేసీయార్ పెట్టబోయే జాతీయపార్టీకి పెద్దగా స్పందన ఉంటుందని అయితే ఎవరూ అనుకోవటంలేదు. ఏపిలో కేసీయార్ పర్యటించినపుడు కొన్ని ఫ్లెక్సీలు కట్టింది వాస్తవమే. అయితే అంతమాత్రాన కేసీయార్ పార్టీకి ఓట్లేసేస్తారని అనుకోవటంలేదు. మరి కేసీయార్ పెట్టబోయే జాతీయపార్టీలో ఏపీలోని బలమైన నేతలు చేరితే ఏమైనా సమీకరణలు మారే అవకాశాలు లేకపోలేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.