Begin typing your search above and press return to search.

నలుగురి వెంటే నాని ?

By:  Tupaki Desk   |   20 Jun 2019 1:01 PM GMT
నలుగురి వెంటే నాని  ?
X
టీడీపీ పునాదులు కదులుతున్నాయి. ఆ పార్టీలో ఎన్నడూ లేని రాజకీయ సంక్షోభం నెలకొంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలుగుదేశం ఇంత నష్టపోలేదు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల రోజుల్లోపే ఆ పార్టీ అతలాకుతలం అవుతోంది. శ్రేణుల్లో భవిష్యత్తుపై భరోసా పోయేలా వరుస సంఘటనల జరుగుతుండటమే దీనికి కారణం.

ఫలితాలు వచ్చిన కొద్దిరోజులకే తెలుగుదేశం నుంచి గెలిచిన ముగ్గురులో ఒకరైన విజయవాడ ఎంపీ కేశినేని నాని కొత్త రాగం తీయడం మొదలుపెట్టారు. ఫేస్ బుక్ వేదికగా సంచలన పోస్టులు చేశారు. వారిలా బయటపడకుండానే... టీడీపీ రాజ్యసభ ఎంపీలు జంప్ జిలానీలు అయ్యారు. రాజ్యసభకు టీడీపీలో ఆరుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో నలుగురు ఈరోజు తాము పార్టీ మారుతున్నట్టు అఫిషియల్ గా లేఖ ఇచ్చారు. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా జరిగిన ఈ పరిణామం టీడీపీలో కలకలం సృష్టించింది. సీఎం రమేశ్‌- సుజనా చౌదరి- గరికపాటి మోహన్‌ రావు- టీజీ వెంకటేశ్‌ ..తమను వేరే గ్రూపుగా గుర్తించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ ఇచ్చారు. అంటే 2/3 వంతు సభ్యులు పార్టీని వీడారు. వీరిని చైర్మన్ వేరే గ్రూపుగా గుర్తిస్తే ఫిరాయింపు చట్టం వర్తించకుండా ఏ పార్టీలో అయినా చేరే అవకాశం వారికి ఉంటుంది.

మరోవైపు రాజ్యసభలో మిగిలిన ఇద్దరు టీడీపీ ఎంపీలు తోట సీతామహాలక్ష్మి, కనకమేడలను కూడా తమ గ్రూపులోకి ఆహ్వానించడానికి సుజనా చౌదరి గ్రూపు ప్రయత్నాలు చేస్తోంది. వీరితో పాటు విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా పార్టీ మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గల్లా జయదేవ్ తో కూడా బీజేపీ ప్రముఖులు మంతనాలు జరుపుతున్నారు. అయితే, ఇప్పటికే ఎన్నో వ్యాపారాల్లో ఉన్న గల్లా జయదేవ్ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ వీడిన ఆశ్చర్యం ఏమీ లేదు. అంటే లోక్ సభ, రాజ్యసభల్లో టీడీపీ సభ్యులు మూడింట రెండొంతులు పార్టీ వీడితే వారు స్వతంత్ర వర్గంగా ఏ పార్టీలో అయినా చేరే అవకాశం అధికారికంగా దక్కించుకుంటారు. మరి ఇది ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.

ఢిల్లీ నుంచి మోడీని ఇంటికి పంపిస్తానని చెప్పిన చంద్రబాబునే మోడీ ఢిల్లీ నుంచి ఇంటికి పంపిస్తున్నాడని అనుకోవచ్చు. కానీ మోడీ ఈ రేంజిలో రివెంజ్ తీర్చుకుంటాడని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు కలలో కూడా ఊహించి ఉండడు. 2019 ఓటమి పార్టీ పునాదులనే బ్రేక్ చేసిందన్నమాట.