Begin typing your search above and press return to search.

బీజేపీలోకి ఈటల బాటలో కొండా విశ్వశ్వరరెడ్డి

By:  Tupaki Desk   |   4 Jun 2021 5:30 AM GMT
బీజేపీలోకి ఈటల బాటలో కొండా విశ్వశ్వరరెడ్డి
X
బీజేపీకి తెలంగాణలో మంచిరోజులు రాబోతున్నాయి. దిగ్గజ నేతలంతా ఆ పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి బర్తరఫ్ చేసిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరికకు దాదాపు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఈటల బాటలో మరో సీనియర్ మాజీ ఎంపీ కొండా విశ్వశ్వరరెడ్డి సైతం నడువనున్నారు. దీంతో బీజేపీలో చేరికకు ఊపు వచ్చినట్టైంది.

టీఆర్ఎస్ నుంచి వైదొలిగి గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన కొండా విశ్వశ్వరరెడ్డి పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి కాంగ్రెస్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా ఆ తర్వాత ఏ పార్టీలోనూ చేరలేదు.

తాజాగా ఏ పార్టీలో చేరాలన్నదానిపై కొన్ని రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటానని తన రాజీనామా సందర్భంగా వెల్లడించారు. అయితే ఆయన బీజేపీ గూటికి చేరడం ఖాయమనే ప్రచారం అప్పటి నుంచి జరుగుతూనే ఉంది.

ఇక ఇవాళ బీజేపీ నేత డీకే అరుణతో కొండా విశ్వశ్వేర రెడ్డి సమావేశం అవుతున్నారు. పార్టీలో చేరికపై ఆయన చర్చించనున్నట్లు సమాచారం. ఈ విషయంలో ఆలస్యం చేయవద్దని వెంటనే నిర్ణయం తీసుకోవాలని డీకే అరుణ సూచించినట్టుగా సమాచారం. దీనికి కొండా కూడా సానుకూలంగానే స్పందించారని టాక్ వినిపిస్తోంది.

ఇక అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. త్వరలోనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందంటున్నారు. పరిణామాలు చూస్తుంటే ఈటలతోపాటు కొండా కూడా బీజేపీలో చేరేలా కనిపిస్తోందని అంటున్నారు. ఇక ఈటల బీజేపీలో చేరడానికి కొండా రాయబారం కూడా నడిపారనే ప్రచారం కూడా జరిగింది.