Begin typing your search above and press return to search.
నాడు శాసించారు.. నేడు పోరాడుతున్నారు..
By: Tupaki Desk | 14 May 2019 6:02 AM GMTకోట్ల కుటుంబం.. దీని చరిత్ర మామూలుగా లేదు.. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రిగా రెండు సార్లు పాలించారు. ఏడు దశాబ్ధాలుగా వీరు రాజకీయాల్లో ఉన్నారు. కర్నూలు జిల్లా వీరికి కంచుకోట.. ఒకప్పుడు రాష్ట్రాన్నే శాసించిన కుటుంబం అది. ఐదేళ్ల నుంచి మత్రం అంతా సైలెంట్ అయిపోయింది. దశాబ్ధాల నుంచి రాజకీయాలను శాసించిన వీరు 2014లో కనుమరుగైపోయారు..
కర్నూలు ఎంపీగా ఐదుసార్లు కోట్ల విజయభాస్కర్ రెడ్డి పోటీచేసి గెలిచారు. ఇక నాలుగు సార్లు ఆయన తనయుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీచేశారు. ఒకసారి విజయభాస్కర్ రెడ్డి సోదరుడు కోట్ల కోదండరామిరెడ్డి పోటీచేసి గ్రాండ్ విక్టరీ కొట్టారు. అంతలా ప్రభావం చూపించిన కోట్ల ఫ్యామిలీ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ తోపాటే కనుమరుగైంది. 2014లో కాంగ్రెస్ తరుఫున పోటీచేసిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దారుణంగా ఓడిపోయారు. ఆయన భార్య కోట్ల సూజాతమ్మ ఆలూరు అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు.
ఐదేళ్లుగా వీరి కుటుంబం స్తబ్దుగా ఉంది. రాజకీయాల్లో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. దీంతో 2019 ఎన్నికల వేళ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ చేశారు. పెద్ద ఫ్యామిలీ కావడంతో చంద్రబాబు ఆహ్వానించారు. మళ్లీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి యాక్టివ్ అయ్యారు. సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు ఎంపీగా.. ఆయన భార్య కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఆలూరు అసెంబ్లీ నుంచి టీడీపీ తరుఫున బరిలోకి దిగారు.
కోట్ల కుటుంబానికి కర్నూలు పరిధిలో విశేషమైన కేడర్, అభిమానులు, ప్రజాభిమానం ఉంది. ఈ నేపథ్యంలోనే రెండు సీట్లలో గెలుపు గ్యారెంటీ అన్న అంచనాలున్నాయి.
అయితే వైసీపీ ఈ సారి బీసీ మంత్రం జపించింది. పోయిన సారి బీసీ నేత బుట్టా రేణుకకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్న వైసీపీ ఈసారి ఎవ్వరూ ఊహించని విధంగా బీసీ నేత, యూరాలజీ ప్రముఖ డాక్టర్ సంజీవ్ కుమార్ ను వైసీపీ రంగంలోకి దింపింది. జగన్ ఇమేజ్, వైసీపీ గాలి, వ్యక్తిగతంగా మంచి పేరున్న ఈయన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి గట్టి పోటీనిచ్చారు.
ఎన్నో దశాబ్ధాల నుంచి రాజకీయాలను శాసిస్తున్న కోట్ల ఫ్యామిలీ ఐదేళ్ల విరామం తర్వాతైనా మళ్లీ చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తుందా? లేదా మరోసారి తెరమరుగు అవుతుందా అనేది మే 23 ఫలితాల తర్వాత తేలనుంది.