Begin typing your search above and press return to search.
షేన్ వార్న్ చనిపోవడానికి లిక్విడ్ డైట్ కారణమా..?
By: Tupaki Desk | 10 March 2022 3:57 AM GMTప్రపంచ క్రికెట్ లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి షేన్ వార్న్. ఆయన ఇటీవల చనిపోయారు. అయితే ఆయన మరణించే సమయానికి లిక్విడ్ డైట్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే చనిపోవడానికి ఇదే సరైన కారణమా అంటే కచ్చితంగా ఇదే అని ఎవరూ చెప్పలేరు. అయితే బరువు తగ్గేందుకు వార్న్ ఇలాంటి డైట్ ప్లాన్ చాలా సార్లు ఫాలో అయ్యే వారు అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
అయితే మరణానికి కారణం ఏమైనా కానీ ప్రస్తుతం అయితే మాత్రం లిక్విడ్ డైట్ అనే అంశం తిరిగి తెర మీదకు వచ్చింది. అయితే కచ్చితంగా ఇవి మన బాడీపై అంత ప్రభావం చూపిస్తాయా అని అంటే దానికి కూడా సమాధానం లేదు. ఇలాంటి దాని గురించి మరింత కొంత తెలుసుకుందాం.
లిక్విడ్ డైట్ అనేది బరువు తగ్గేందుకు ఫాలో అయ్యే ఓ రకం పద్దతి. అయితే దీని లక్ష్యం ఒక్కటే. మనిషి బరువు తగ్గించడం. లిక్విడ్ డైట్ తీసుకోవడం వల్ల శరీరంలో కేలరీలు తగ్గకుండా బరువు తగ్గుతారు. అయితే దానిని అందరూ ఫాలో కావచ్చా అని అంటే కచ్చతంగా చెప్పలేము. కానీ దీనిని ఫాలో అయ్యే ముందు కచ్చితంగా సంబంధిత వ్యక్తులు డాక్టర్ ను కలిసి వారి సలహాలు సూచనలు మేరకు మాత్రం చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రధాన కారణం.. ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కొక్కలా ఉంటుంది.
అందుకే డాక్టర్ సూచనతోనే చేయాలి. లిక్విడ్ డైట్ లో తక్కువ కేలరీలను ఉత్పత్తి చేసే వస్తువులు ఉంటాయి. వాటిలో ఎక్కువగా మిల్క్, సూపులు, ఇతర రసాలు, పండ్ల రసాలు ఇలా అనేకం ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. అంతే కాకుండా చర్మం కూడా చాలా బాగా ఉంటుంది.
బరువు తగ్గాలి అని అనుకునే వారు.. పండ్లకు సంబంధించిన జ్యూస్ తీసుకునే దానికి ఎక్కువగా ఇష్ట పడతారు. ఇలా చేయడం వల్ల మనుషులు సులభంగా తగ్గుతారు. దానికి తోడు కాంతివంతం అయిన చర్మం కూడా వస్తుందని భావిస్తారు. దీనిలో మహిళలు కానీ పురుషులు కానీ తేడా లేకుండా జ్యూస్ లతో పని కానిస్తారు.
అయితే ఈ డైటింగ్ అనేది అందరిలో ఒకే విధంగా ఉండదు అని చెప్తున్నారు. అందులోనూ తీసుకున్న జ్యూస్లు కచ్చితంగా మీరు అనుకున్న విధంగా పని చేస్తుందనే నమ్మకం కూడా లేదని అంటున్నారు. అందుకే ఇలాంటి ఫాలో అయ్యేటప్పుడు మీరు మీ పర్సనల్ లేక ఫ్యామిలీ డాక్టర్ ను కలిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.
ఈ లిక్విడ్ డైటింగ్ ప్రారంభించన చాలా మందిలో కొద్ది రోజుల్లోనే కొన్ని తేడాలు కనిపిస్తాయి. కేవలం వారాల వ్యవధిలోనే తేజడా కనిపిస్తుంది. ఈ సమయంలో వారు డల్ అయినట్లు కనిపిస్తారు. బాడీ అంతా మగతా అనిపిస్తుంటుంది. ఈ సమయంలో శరీరానికి కావాల్సి పండ్లు, కూరగాయలు లాంటివి తీసుకోవాలి. ఇవి తీసుకోవడం వల్ల మన బాడీకి మినరల్స్ కావాల్సినన్ని వస్తాయి. వీటితో పాటుగా.. విటమిన్స్ కూడా అందుతాయి. శరీరంలో బరువు పెంచే కొవ్వులను ఇవి ధరి చేరనియ్యవు.
ఇది ఫాలో అయ్యేటప్పుడు మహిళల్లో అయితే రక్త హీనత అనేది కనిపించవచ్చు అని కొందరు నిపుణులు చెప్తున్నారు. సాఫ్ట్ ఫుడ్ కు అలావాటు పడినందున జీర్ణ వ్యవస్థ కూడా నెమ్మదిస్తుందని చెప్తున్నారు. కానీ మిగతా వ్యవస్థలు సక్రమంగా పని చేస్తాయిని అంటున్నారు. దీని వల్ల పురుషుల్లో అయితే తరుచూ తలనొప్పి రావడం, కళ్ల తిరగడం, మల బద్దకం, విరేచనాలు వంటివి కనిపించవచ్చు అని అంటున్నారు. దీనిలో ఉంటే మరో అంశం ఏమిటి అంటే బరువు ఎంత సులభంగా అయితే తగ్గుతావో అంత త్వరగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే డాక్టర్ సలహాల మేరకు సరైన పద్దతిలో డైట్ పాటించాలని చెప్తున్నారు.