Begin typing your search above and press return to search.

మహారాష్ట్ర కింగ్ మేకర్ ఎన్సీపీనా?

By:  Tupaki Desk   |   24 Oct 2019 6:07 AM GMT
మహారాష్ట్ర కింగ్ మేకర్ ఎన్సీపీనా?
X
మహారాష్ట్రలో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఆ పార్టీ సొంతంగా కేవలం 99 సీట్లకే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ అధికారం దక్కాలంటే శివసేన (55కు పైగా సీట్లలో ఆధిక్యం) మద్దతు తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో శివసేన హ్యాండిస్తే బీజేపీ కొంప కొల్లేరు అవుతుంది. ఇప్పటికే సీఎం పీఠం తమ యువ వారసుడు ఆదిత్య థాకరేకు ఇస్తేనే మద్దతిస్తామని శివసేన కండీషన్లు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి..

అయితే మహారాష్ట్రలో బోటాబోటా మెజారిటీ బీజేపీకి షాక్ లా మారింది. స్పష్టమైన సీట్లు రాకపోవడంతో నంబర్ గేమ్ మొదలైంది. 51 సీట్లలో ఆధిక్యంలో దూసుకెళుతున్న శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇప్పుడు కీరోల్ పోషిస్తోంది. ఆ కాంగ్రెస్+శివసేనకు, లేదా బీజేపీకి ఎవరికి మద్దతిస్తే వారిదే అధికారం అన్నట్టు పరిస్థితి ఉంది.

ఇక లేదంటే కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిస్తే మహారాష్ట్రలో అధికారం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్సీపీ కనుక శివసేనకు ముఖ్యమంత్రి ఆఫర్ ఇస్తే ఖచ్చితంగా సాధ్యమయ్యే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే బీజేపీకి గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు...

ముఖ్యమంత్రి పీఠం ఇప్పుడు మహారాష్ట్రలో పొత్తుల సంసారం మీదనే ఆధారపడి ఉంది. బీజేపీ 99, శివసేన 50 +, ఎన్సీపీ51, కాంగ్రెస్ 40+ సీట్లతో ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్నాయి. ఎన్సీపీ కింగ్ మేకర్ లా ఉంది. ఆ పార్టీ ఎవరికి మద్దతిస్తే వారిదే అధికారంలా ఉంది. సో ఈ పరిణామం బీజేపీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోంది. శరద్ పవార్, ఆయన అల్లుడిపై ఈడీ కేసులు పెట్టి శరద్ అల్లుడిని జైలుకు పంపిన బీజేపీని దెబ్బకొట్టడానికి శరద్ పవార్ కు ఇంతకు మించిన చాన్స్ లేదు. ఎన్సీపీ తాజాగా శివసేనతో కలిసి పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న చర్చ సాగుతోంది.చూడాలి మరీ మహారాష్ట్ర రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో..బీజేపీకి ఎలాంటి బొక్క పడుతుందో.