Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్లు ‘గే’లా?

By:  Tupaki Desk   |   14 Feb 2023 5:14 PM GMT
ఆ ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్లు ‘గే’లా?
X
ఆ ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్లు డ్రెస్సింగ్ రూంలో చేసుకున్న రోమాన్స్ అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. 2019లో జరిగిన మ్యాచ్‌లో మార్కస్ స్టోయినిస్ - ఆడమ్ జంపాలు డ్రెస్సింగ్ రూమ్‌లో కొంచెం బ్రోమాన్స్‌లో నిమగ్నమయ్యారు. వీరిద్దరూ కేఎఫ్.సీ బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ కోసం ఆడుతున్నారు. తాజాగా వీరిద్దరూ వాలెంటైన్స్ డేని జరుపుకోవడానికి జంపా ఏకంగా స్టోయినిస్ బుగ్గలపై ముద్దు పెట్టుకున్న ఫోటోను బీబీఎల్ యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పంచుకున్నారు. "హ్యాపీ వాలెంటైన్స్ డే" అని రాసిన పోస్ట్‌ను షేర్ చేస్తూ, క్యాప్షన్‌లో ఇష్టపడే ఎమోజి కూడా షేర్ చేశారు. దీంతో వీరిద్దరూ ‘గే’లు అని.. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నారన్న ప్రచారానికి ఈ ఫొటో అధికారికంగా గుర్తింపునిచ్చినట్టైంది.

జంపా, స్టాయినిస్ వెనుక చేయి వేసుకున్న ఫొటోను ‘మెల్ బోర్న్ స్టార్స్’ టీం షేర్ చేసింది. దీంతో వీరిద్దరూ ‘గే’లు అని గతంలో జరిగిన ప్రచారం వాస్తవం అని తేలింది. అయితే వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని కొందరు అంటున్నారు.

ఆడమ్ జాంపా -మార్కస్ స్టోయినిస్ ఇద్దరూ ఆస్ట్రేలియాకు కీలకమైన మ్యాచ్ విన్నర్లు. మెల్‌బోర్న్ స్టార్స్ కోసం అనేక మ్యాచులను కూడా గెలిపించారు. ఆడమ్ జాంపా -మార్కస్ స్టోయినిస్ ఇద్దరూ తమ 'బ్రోమాన్స్' యొక్క విజువల్స్‌ను చాలా తరచుగా పోస్ట్ చేయడం కూడా అందరూ చూశారు. వారి అభిమానులు వీరిద్దరి గే ప్రేమను కాదనకుండా అభిమానిస్తూనే ఉన్నారు.

బీబీఎల్ 2023లో ఇద్దరి ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే మార్కస్ స్టోయినిస్ కేవలం 9 మ్యాచ్‌లలో కేవలం 23.75 సగటుతో రెండు అర్ధ సెంచరీలతో 190 పరుగులు చేయగలిగాడు. బ్యాట్‌తో ఫర్వాలేదనిపించేలా సీజన్‌ను కొనసాగిస్తున్నాడు. ఇక ఆడమ్ జంపా అద్భుతమైన బీబీఎల్ సీజన్‌ను కలిగి ఉన్నాడు. తనను ఎంపిక చేయాల్సిందేనన్నట్టుగా జంపా ఆస్ట్రేలియా సెలెక్టర్లకు స్పష్టమైన సందేశాన్ని కూడా పంపాడు.

ఈ లెగ్ స్పిన్నర్ 14 ఇన్నింగ్స్‌లలో 7.14 ఎకానమీతో మరియు 25 సగటుతో 16 వికెట్లు తీశాడు. లెగ్ స్పిన్నర్ గతంలో ఆస్ట్రేలియా - దేశవాళీ క్రికెట్‌లో కూడా మంచి ప్రదర్శన చేసినప్పటికీ రెండుసార్లు భారత పర్యటనలో ఎంపిక కాలేదు..

మార్కస్ స్టోయినిస్ ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరపున 51 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 29.7 సగటు మరియు 147.3 స్ట్రైక్ రేట్‌తో 803 పరుగులు చేశాడు. మార్కస్ స్టోయినిస్ కూడా ఐపీఎల్ లో జట్లకు చాలా ముఖ్యమైన ఆటగాడిగా ఉన్నాడు. అనేక మ్యాచ్‌లను ఒంటరిగా గెలిచాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.