Begin typing your search above and press return to search.

జైషే చ‌చ్చిన‌ట్టే!... మ‌సూద్ ఇక లేడ‌ట‌!

By:  Tupaki Desk   |   3 March 2019 1:58 PM GMT
జైషే చ‌చ్చిన‌ట్టే!... మ‌సూద్ ఇక లేడ‌ట‌!
X
పుల్వామా దాడిలో 40 మంది భారత సైనికుల‌ను పొట్ట‌న‌బెట్టుకున్న ఆత్మాహుతి దాడికి ప‌క్కా ప‌థ‌కం ప‌న్నిన క‌ర‌డుగ‌ట్టిన మౌలానా మ‌సూద్ అజార్ మ‌ర‌ణించిన‌ట్లుగా ఇప్పుడు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఒక్క పుల్వామా దాడే కాకుండా భార‌త్‌పై జ‌రిగిన ముంబై బాంబు పేలుళ్లు, ప‌ఠాన్ కోట్ ఎయిర్‌బేస్ పై దాడుల‌కు కూడా మ‌సూదే మాస్ట‌ర్ మైండ్‌గా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. ఎక్క‌డో పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో సేఫ్ షెల్ట‌ర్‌లో కూర్చున్న మ‌సూద్‌... భార‌త్ లో అల్ల‌క‌ల్లోలం సృష్టించ‌డ‌మే ల‌క్ష్యంగా సాగుతున్నాడు. అమాయ‌క యువ‌త‌ను చేర‌దీసి... వారిలో భార‌త్‌పై విధ్వేషం పెంచేసి... వారినే మాన‌వ బాంబుల్లా మార్చేసి భార‌త్‌పైకి పంపడమే ల‌క్ష్యంగా మ‌సూద్ జైషే మొహ్మ‌ద్ సంస్థ‌ను స్థాపించాడు. ఉగ్ర‌వాద కార్యక‌లాపాల‌కు పాల్ప‌డుతున్న అత‌డిని అన్ని దేశాల‌తో పాటు ఐక్య‌రాజ్య‌స‌మితి కూడా క‌ర‌డుగ‌ట్టిన ఉగ్ర‌వాదిగా ముద్ర వేసినా కూడా పాకిస్థాన్ అత‌డిని ఉగ్ర‌వాది అంటే ఒప్పుకోవ‌డం లేదు.

ఈ క్ర‌మంలో పుల్వామా దాడిలో పెద్ద సంఖ్య‌లో జ‌వాన్లు మ‌ర‌ణించ‌డంతో ఒక్క‌సారిగా భార‌త్ భ‌గ్గుమంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పాక్ దురాగ‌తానుల చూస్తూ ఊరుకునేది లేదంటూ మొన్న స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌కు అనుమ‌తించేశారు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డ‌మే ఆల‌స్యం... రంగంలోకి దిగేసిన భార‌త వాయుసేన పీఓకేలోని జైషే ఉగ్ర‌వాద శిబిరాలే ల‌క్ష్యంగా ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. కేవలం 21 నిమిషాల్లోనే ముగిసిన ఈ దాడుల్లో ఏకంగా 350 మంది దాకా ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించారు. అయితే ఈ దాడులు జ‌రిగిన ప్రాంతంలోనే ఉన్న మ‌సూద్ కూడా తీవ్రంగా గాయ‌ప‌డ్డాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అప్ప‌టికే తీవ్ర‌మైన అనారోగ్యంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న మ‌సూద్‌.. భార‌త్ కొట్టిన దెబ్బ‌కు చికితిపోయాడ‌ని స‌మాచారం.

ఈ గాయాలతో ఆసుప‌త్రిలో చేరిన మ‌సూద్ గాయాల నుంచి కోలుకోలేక‌పోయాడ‌ని, ఈ క్ర‌మంలోనే అత‌డు నిన్న మ‌ర‌ణించాడ‌ని ఇప్పుడు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల‌న్నీ కూడా పాకిస్థాన్ లోకల్ మీడియా నుంచే వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్త‌ల‌ను ఇప్ప‌టిదాకా పాక్ ప్ర‌భుత్వం దృవీక‌రించ‌లేదు. అలాగ‌ని ఈ వార్త‌ల‌ను పాక్ ఖండించ‌నూ లేదు. ఈ నేప‌థ్యంలో ఈ వార్త‌లు వాస్త‌వ‌మేన‌ని, మ‌సూద్ చనిపోయే ఉంటాడ‌న్న వాద‌న వినిపిస్తోంది. మొత్తంగా మ‌సూద్ మ‌ర‌ణంతో ఇక జైషే ప‌ని అయిపోయిన‌ట్టేనన్న వాద‌న కూడా వినిపిస్తోంది. భార‌త్‌పై దాడులే ల‌క్ష్యంగా పురుడుపోసుకున్న జైషే... త‌న అధినేత మ‌సూద్ మ‌ర‌ణంతో తాను కూడా దాదాపుగా మ‌ర‌ణించిన‌ట్టేన‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.