Begin typing your search above and press return to search.
మంత్రి పెద్దిరెడ్డిని టీడీపీ టార్గెట్ చేసుకున్నట్టేనా?
By: Tupaki Desk | 8 July 2022 3:30 PM GMTఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో అధికార పార్టీలో కీలక నేతగా చక్రం తిప్పుతున్నారు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన మంత్రిగా ఉండగా, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా, ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఆయా జిల్లాల పార్టీ వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తున్నారు.
ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పంలో గతంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీని చావుదెబ్బ కొట్టింది.. వైఎస్సార్సీపీ. తొలిసారిగా కుప్పం మున్సిపాలిటీలో ఘనవిజయం సాధించింది. దీంతో టీడీపీ షాక్ తింది. మున్సిపల్ ఎన్నికలకు ముందు జరిగిన మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ టీడీపీకి పరాజయాలే ఎదురయ్యాయి. ఇదే ఊపులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఓడించాలని వైఎస్సార్సీపీ ఉరకలేస్తోంది. ఈ బాధ్యతలను సీఎం వైఎస్ జగన్ మంత్రి పెద్దిరెడ్డి మీదే పెట్టారు. అసలు ఈ ఎన్నికనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా ఆ బాధ్యతలను జగన్.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే అప్పగిస్తున్నారు. ఆయన కూడా సీఎం జగన్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి ఇప్పటి నుంచే కుప్పంపై దృష్టి సారించారు. చంద్రబాబుపై సవాళ్లు విసురుతున్నారు. ఆయనను ఈసారి భారీ మెజారిటీతో ఓడిస్తామని చెబుతున్నారు. దీంతో టీడీపీ కూడా అంతే ధీటుగా స్పందిస్తోంది. పెద్దిరెడ్డి.. జగన్ ఫొటో లేకుండా గెలవగలరా అని సవాల్ విసురుతోంది. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాలో మినీ మహానాడు, బాదుడే బాదుడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటికి జనం భారీ స్థాయిలో హాజరవుతున్నారని వార్తలు వస్తున్నాయి.
టీడీపీ సవాల్ పై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. చంద్రబాబు నాయుడికి దమ్ముంటే ఇప్పుడే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. కుప్పంలోనైనా సరే, తంబళ్లపల్లెలోనైనా ఆయనను చిత్తుగా ఓడిస్తామని నొక్కి వక్కాణించారు.
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి.. మీరు చాలా శక్తివంతమైన రాజకీయ నేతనని అనుకొంటే సరిపోదు.. మీకు నిజంగా అంత సామర్థ్యం ఉంటే వచ్చే ఎన్నికలలో జగన్ ఫోటో పెట్టుకోకుండా మీ సొంత బలంతో గెలవగలరా అని సవాల్ విసిరారు. పెద్దిరెడ్డికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరేమీ తెలియదు. వచ్చే ఎన్నికలలో టీడీపీ చేతిలో ఓటమి తప్పదని హెచ్చరించారు.
దీనికి కౌంటర్ గానే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేసినంత మాత్రన్న కిషోర్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు జిల్లాలో గెలుస్తారనుకొంటే భ్రమే. కిశోర్ కుమార్ రెడ్డి జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేసినా తప్పకుండా ఓడిస్తాం. చంద్రబాబు నాయుడుకి దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కుప్పం లేదా తంబళ్ళపల్లి నుంచి పోటీ చేస్తానంటే నేను రాజీనామా చేస్తాను. నాపై గెలిచి చూపించి అప్పుడు మాట్లాడాలని సవాల్ విసిరారు. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో టీడీపీ, వైఎస్సార్సీపీ నేతల మధ్య సవాళ్లు హాట్ టాపిక్ గా నిలిచాయి.