Begin typing your search above and press return to search.
చెవిరెడ్డి విషయంలో మంత్రి రోజాకు దిగులా? ఎందుకు?
By: Tupaki Desk | 25 Nov 2022 8:35 AM GMTరాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితి రేపు ఉంటుందనే గ్యారెంటీ ఏమీలేదు. నిన్నటి రోజున పెద్దగా గుర్తింపు లేనివారికి నేడు రావొచ్చు. లేదా రేపు కావొచ్చు! సో.. రాజకీయాల్లో నేతలకుఎప్పుడు ఏది దక్కుతుందో.. ఎప్పుడు ఏది ఊడుతుందో చెప్పడం కష్టమే. ఇప్పుడు ఇదే పరిస్థితి వైసీపీ ఫైర్ బ్రాండ్, నగిరి ఎమ్మెల్యే రోజాకు కూడా ఎదురైందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక మంత్రిగా రోజా వ్యవహ రిస్తున్నారు.
వరుస విజయాలు, టీడీపీ కీలక నేతలను ఓడించడం.. ప్రతిపక్షంపై నిప్పులు చెరగడం వంటి అంశాలతో నిత్యం మీడియాలో ఉండే రోజా.. 2019లోనే మంత్రివర్గంలో బెర్త్ ఆశించారు. అయితే, అప్పుడు సాధ్యంకా లేదు. దీంతో కొన్నాళ్లు అలిగి.. పార్టీకి దూరంగా ఉన్నారు. ఇక, ఎట్టకేలకు ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రోజా స్థానం దక్కించుకున్నారు. తన కేబినెట్‌లో రెండు సార్లుమార్పులు ఉంటా యన్న జగన్ ఆమేరకు చేశారు.
సో.. ఈ కేబినెట్ వచ్చే ఎన్నికల వరకు ఉంటుందని మంత్రులు భావిస్తున్నారు. కానీ, ఇటీవల సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను గమనిస్తే.. పనిచేస్తున్నవారికే పీఠాలు పదిలంగా ఉంటున్నాయి తప్ప.. పేరును బట్టి.. ఊరును బట్టి మాత్రం కాదనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే సజ్జల, బుగ్గన, బొత్స వంటి కీలకనేతల పదవులను మార్చేశారు. పార్టీపరంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నా.. రాజకీయంగా మాత్రం సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కేబినెట్ మంత్రులను కూడా మార్చేసిన మార్చేయొచ్చు.. అనేది రాజకీయ వర్గాల టాక్. ఎందుకంటే.. సీఎం జగన్ ఒక నిర్దిష్ట అంశాన్ని పెట్టుకుని, తనకు రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందని భావించే.. మంత్రి వర్గంలోకి వీరినితీసుకున్నారు. అయితే.. ఇప్పటికి ఆరు మాసాలు అయిపోయినప్పటికీ మంత్రుల సామర్థం కానీ, వారి పనితీరు కానీ.. మెరుగు పడకపోగా.. జగన్ ఆశించినట్టు గావారు దూకుడు ప్రదర్శించలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో పైకి చెప్పకపోయినా.. మరోసారి మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేసే అవకాశం ఉందని తాడేప ల్లి వర్గాల నుంచి సమాచారం బయటకు వస్తోంది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాను తీసుకుంటే.. రోజాకు గండం తప్పేలా లేదని అంటున్నారు. ఈ జిల్లా నుంచి పార్టీ విధేయుడిగా ముఖ్యంగా వైఎస్ కుటుంబంతో ఎంతో కీలకమైన అనుబంధం ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఈ దఫా మంత్రి వర్గంలో చోటు దక్కడం ఖాయమని సమాచారం.
ఈ పరిణామమే రోజాకు సెగపెడుతోంది. మంత్రిగా రోజా.. చేసిన కీలకమైన పని ఇదీ.. అని చెప్పుకొనే పరిస్థితి కనిపించడం లేదు. పైగా.. పర్యాటక మంత్రిగా ఉన్న రోజా ఒక్కటంటే ఒక్క పెట్టుబడినికూడా తీసుకురాలేక పోయారు. కేవలం ఉత్సవాల్లో డ్యాన్స్ చేయడం,, టీడీపీపై విమర్శల జల్లు కురిపించడం వంటివి తప్ప తన శాఖలో సంచలన నిర్ణయం తీసుకున్నది లేదు. అమలు చేసింది కూడా లేదు. సో.. రేపు మంత్రి వర్గ విస్తరణ జరిగితే మాత్రం ఖచ్చింతంగా రోజా ప్లేస్‌లోకి చెవిరెడ్డి ఖాయమనే గుసగుస వినిపిస్తుండడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.